Viral Video: వామ్మో.. ఇది కారా? గూడ్స్ లారీనా.. మారుతీ కారుపై 24 డ్రమ్ములను ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..
ABN, Publish Date - Nov 11 , 2024 | 01:48 PM
సాధారణంగా మారుతి-800 కారులో నలుగురు, ఐదుగురికి మించి ప్రయాణించడం కష్టం. కొద్దిగా లగేజ్ కూడా తీసుకెళ్లవచ్చు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి ఆ చిన్న కారును లగేజ్‌ను తీసుకెళ్లే ట్రక్కులా మార్చేశాడు. ఆ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు.
మన దేశంలో కొందరు డబ్బులను పొదుపు చేసేందుకు సాహసాలు చేస్తుంటారు. ఒకే బైక్ మీద నలుగురు, ఐదుగురు ప్రయాణించడం, చిన్న వాహనంపై సామర్థ్యానికి మించిన లగేజ్‌ను తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు. అలాంటి ప్రయాణాల్లో ఏమైనా పొరపాట్లు జరిగితే వారికే కాదు.. పక్క వారికి కూడా ప్రమాదాలు తప్పవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవక తప్పదు. ఆ వీడియోలో చిన్న కారు (Car)పై భారీ లగేజ్‌ను తీసుకెళ్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
morya_sound అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. సాధారణంగా మారుతి-800 కారు (Maruti-800)లో నలుగురు, ఐదుగురికి మించి ప్రయాణించడం కష్టం. కొద్దిగా లగేజ్ కూడా తీసుకెళ్లవచ్చు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి ఆ చిన్న కారును లగేజ్‌ను తీసుకెళ్లే ట్రక్కులా మార్చేశాడు. ఆ కారుపై ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 24 భారీ డ్రమ్ములను తాడుతో కట్టి సునాయాసంగా తీసుకెళ్లిపోతున్నాడు. రోడ్డుపై వెళ్తున్న వారు ఆ కారును చూసి షాకై వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. లక్ష మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇది మారుతి-800 పవర్``, ``అర్జెంట్ డెలివరీ``, ``పోలీసులు ఏం చేస్తున్నారు``, ``అది మారుతి-8000``, ``ఇండియాలోనే ఇలాంటివి సాధ్యం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Shocking: డ్రైవర్ చేసిన చిన్న తప్పు.. భారీ మూల్యం చెల్లించిన ఓనర్.. ఒడిశాలో ఏం జరిగిందో తెలిస్తే..
Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. తక్కువ ఖర్చుతో రూమ్ హీటర్ ఎలా తయారు చేశాడంటే..
IQ Test: ఈ నలుగురిలో ప్రమాదంలో ఉన్నది ఎవరు?.. 5 సెకెన్లలో గుర్తించి హెచ్చరించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Nov 11 , 2024 | 01:48 PM