Viral: బీర్‌లపై ఆసక్తి అతడిని లక్షాధికారిని చేసింది.. బ్రిటన్‌కు చెందిన ఆ వ్యక్తి కథేంటంటే..
ABN, Publish Date - May 10 , 2024 | 11:35 AM
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యమే కాదు.. డబ్బులు కూడా భారీగా ఖర్చవుతాయి. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం దీనికి రివర్స్. బీర్లు తాగడం, ఖాళీ క్యాన్లను భద్రపరచడం, ఇతరులు తాగి పారేసినవి కూడా కలెక్ట్ చేయడం అతడికి హాబీ.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యమే కాదు.. డబ్బులు కూడా భారీగా ఖర్చవుతాయి. అయితే బ్రిటన్‌కు (Britain) చెందిన ఓ వ్యక్తి మాత్రం దీనికి రివర్స్. బీర్లు తాగడం, ఖాళీ క్యాన్లను భద్రపరచడం, ఇతరులు తాగి పారేసినవి కూడా కలెక్ట్ చేయడం అతడికి హాబీ (Beer can collections). 42 ఏళ్లుగా అతడు ఆ పని చేస్తూనే ఉన్నాడు.. ఆ అలవాటు వల్లే అతడు లక్షధికారి అయ్యాడు. బ్రిటన్‌లోని సోమర్‌సెట్‌కు చెందిన ఆ వ్యక్తి స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral News).
సోమర్‌సెట్‌కు చెందిన 65 ఏళ్ల నిక్ వెస్ట్ గత 42 సంవత్సరాలుగా అరుదైన బీర్ క్యాన్లను (Rare Beer cans) సేకరిస్తున్నాడు. ఈ అభిరుచి కారణంగా అతడు అన్నేళ్లలో ఏకంగా 10,300 బీర్ క్యాన్లను సేకరించాడు. వాటిల్లో చాలా అరుదుగా దొరికే బీరు క్యాన్స్ కూడా ఉన్నాయి. 16 ఏళ్ల వయసులో నిక్ వెస్ట్ బీర్లు తాగే అలవాటు చేసుకున్నాడు. ఖాళీ క్యాన్లను ఒక దగ్గర దాచడం మొదలు పెట్టాడు. అలాగే, ఎక్కడైనా అరుదైన బీర్ క్యాన్లు దొరికితే వాటిని కూడా తెచ్చి దాచేవాడు. అయితే అతడి ఇల్లు చిన్నది కావడంతో బీర్ క్యాన్లను దాచేందుకు స్థలం సరిపోలేదు.
బీర్ క్యాన్ల కలెక్షన్ కోసమే ఓ ఫైవ్ బెడ్రూమ్ ఇంటికి మారాడు. అయితే పదవీ విరమణ తర్వాత అతడికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. మరోవైపు తాను తగిన బీరు క్యాన్స్ ను పెట్టేందుకు స్థలం లేదు. దీంతో తన కలెక్షన్‌లోని కొన్నింటిని అమ్మెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా అరుదైన 6000 బీర్ క్యాన్లను అమ్మగా $13500 (రూ. 14 లక్షలు) వచ్చాయి. ఆ తర్వాత మరో 1,800 డబ్బాలను విక్రయించగా $12,500 (రూ. 10 లక్షలు) అందుకున్నాడు. మరికొన్నింటిని బ్రిటీష్ మ్యూజియానికి కూడా విరాళంగా ఇచ్చాడట.
ఇవి కూడా చదవండి..
Puzzle: చాలా సులభమైన పిక్చర్ పజిల్.. ఈ ఫొటోలో హెడ్‌ఫోన్స్ ఎక్కడున్నాయో 5 సెకెన్లలో కనిపెట్టండి!
Viral video: అరే.. ఇదేంటీ..! పామును ఇలాక్కూడా పట్టొచ్చా.. ఇతడి టాలెంట్ మామూలుగా లేదుగా..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 10 , 2024 | 11:35 AM