ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: వామ్మో.. ఐదు నిమిషాల పార్కింగ్.. రూ.11 లక్షల జరిమానా.. ఓ మహిళకు ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

ABN, Publish Date - Aug 03 , 2024 | 04:18 PM

సాధారణంగా కార్ పార్కింగ్ బిల్లు అంటే ఏ వందో, రెండు వందలో ఉంటుంది. విమానాశ్రయం, షాపింగ్ మాల్స్ వంటి ప్రీమియం ఏరియాల్లో వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చు. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ పార్కింగ్ నిబంధనలు అతిక్రమించినందుకు ఏకంగా రూ.11 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది.

Car Parking

సాధారణంగా కార్ (Car) పార్కింగ్ బిల్లు అంటే ఏ వందో, రెండు వందలో ఉంటుంది. విమానాశ్రయం, షాపింగ్ మాల్స్ వంటి ప్రీమియం ఏరియాల్లో వెయ్యి రూపాయల వరకు ఉండవచ్చు. అయితే బ్రిటన్‌ (Britain)కు చెందిన ఓ మహిళ పార్కింగ్ నిబంధనలు (Parking Rule)అతిక్రమించినందుకు ఏకంగా రూ.11 లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇంటికి వచ్చిన పార్కింగ్ (Car Parking) బిల్లు చూసి ఆమె కళ్లు బైర్లు కమ్మాయి. అయితే నిబంధనల ప్రకారం చేసేదేం లేదు కనుక ఆమె ఆ భారీ జరిమానా (Parking Fine) చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral News).


బ్రిటన్‌లోని దర్హం కౌంటీలో నివసిస్తున్న హెన్నా రాబిన్సన్ అనే మహిళ ఫీథమ్ లీజర్స్ సెంటర్‌లో గత నాలుగేళ్లుగా తన కారును పార్కింగ్ చేస్తోంది. అలా పార్కింగ్ చేసినందుకు ఫీజు కూడా చెల్లిస్తూ వస్తోంది. అయితే ఆ సెంటర్‌లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ అమల్లో ఉంది. అదేంటంటే.. కారు పార్క్ చేసిన ఐదు నిమిషాల లోపు కచ్చితంగా పార్కింగ్ ఫీజు చెల్లించాలి. కొందరు వ్యక్తులు పార్కింగ్ ఏరియాలో అనవసరంగా వెయిట్ చేస్తుండడం, చాలా ఆలస్యంగా రిసీప్ట్ తీసుకుని ఎక్కువ సేపు పార్కింగ్ ఏరియాల్లో కారు నిలుపుతుండడంతో మేనేజ్‌మెంట్ దృష్టికి వచ్చింది.


అలాంటి వారికి కళ్లెం వేసేందుకు ఈ ఐదు నిమిషాల రూల్‌ను అమల్లోకి తీసుకొచ్చారు. కారు పార్కింగ్ చేసిన ఐదు నిమిషాల లోపు టికెట్ తీసుకోకపోతే 170 పౌండ్లు (రూ. 1800) చెల్లించాల్సిందే. 2021 నుంచి హెన్నా మొత్తం 67 సార్లు ఇలా ఆలస్యంగా ఫీజు చెల్లించినట్టు తేలడంతో ఆమెకు మొత్తం 11 వేల పౌండ్లు (రూ.11 లక్షలు) జరిమానా విధించారు. దీంతో ఆమె షాకైంది. పార్కింగ్ ఏరియాలో ఇంటర్నెట్ సౌకర్యం లేదని, తాను బయటకు వచ్చి ఫీజు చెల్లించడం వల్లే ఆలస్యమవుతోందని ఆమె పేర్కొంది. ఆమె మాత్రమే కాదు.. ఈ నిబంధన వద్ద తాము కూడా జరిమానాలు కట్టామని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: తమ్ముడూ.. ఇలా అయితే వధువు పారిపోతుందేమో.. పెళ్లిలో వరుడి తుఫాన్ డ్యాన్స్ చూడండి..!


Picture Puzzle: మీవి హెచ్‌డీ కళ్లు అయితే.. ఈ ఫొటోలో తేడాగా ఉన్న డబ్బుల సంచిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఐదు సింహాలు చుట్టుముడితే ఎలా ఉంటుంది.. ఓ హిప్పో ఏం చేసిందో చూడండి..!


Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!

Viral Video: వామ్మో.. ఇలా కూడా బస్సు నడుపుతారా? డ్రైవర్‌కు కండక్టర్ చేస్తున్న సహాయం చూస్తే షాకవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 03 , 2024 | 04:18 PM

Advertising
Advertising
<