ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Videos: కళ్ల ముందే భారీ ప్రమాదం.. బీడీ వెలిగించి అగ్గిపుల్ల పారేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి..!

ABN, Publish Date - Aug 23 , 2024 | 02:06 PM

చిన్న చిన్న తప్పులు భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. చిన్న పాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. బీడీ వెలిగించుకున్న తర్వాత మంటతోనే ఉన్న అగ్గిపుల్లను విసిరేయడం వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Fire accident

చిన్న చిన్న తప్పులు భారీ ప్రమాదాలకు కారణమవుతాయి. చిన్న పాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. బీడీ (Beedi) వెలిగించుకున్న తర్వాత మంటతోనే ఉన్న అగ్గిపుల్లను (Matchstick) విసిరేయడం వల్ల భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించింది. ఆ ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. @sudhakarudumula అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పాన్ షాప్ ముందు రెండు బైక్‌లు ఆగి ఉన్నాయి. వాటిల్లో ఒక బైక్ నుంచి పెట్రోల్ (Petrol) లీక్ అయి కారుతోంది. ఆ విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. ఆ షాప్ ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి బీడీ తీసి నోట్లో పెట్టుకున్నాడు. ఆ బీడీని అగ్గిపుల్లతో వెలిగించుకున్నాడు. అనంతరం మంటతో ఉన్న అగ్గిపుల్లను విసిరేశాడు. ఆ అగ్గిపుల్ల కారుతున్న పెట్రోల్‌పై పడింది. దీంతో వెంటనే మంటలు చెలరేగాయి. దీంతో ఆ వీధిలో చాలా భాగాన్ని మంటలు ఆక్రమించాయి. రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, వాహనాలు దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే నీటిని ఉపయోగించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్ష మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియచేశారు. ``ఆ వ్యక్తి ఇక ఎప్పుడూ అగ్గిపుల్లను ఆర్పకుండా పడెయ్యడు``, ``చిన్న పొరపాటు.. పెద్ద నష్టం``, ``అక్కడ పెట్రోల్ పోతుంటే ఎవ్వరూ ఎందుకు గుర్తించలేకపోయారు, స్మెల్ వస్తుంది కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: మొబైల్ లేకపోతే జీవితం లేదు.. పరీక్షలో విద్యార్థి జవాబుకు టీచర్ ఫిదా.. పదికి పది మార్కులు ఎందుకేశారంటే..


Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!


Viral Video: పాకిస్తాన్ బోర్డర్‌లో అరుదైన దృశ్యం.. సరిహద్దు అవతలి నుంచి ఎలా మాట్లాడుకున్నారో చూడండి..


Viral Video: బిజీ రోడ్డుపై డబ్బులు వెదజల్లిన యువకుడు.. తర్వాతేం జరిగిందో చూడండి.. వీడియో వైరల్!


IQ Test: మీ తెలివితేటలకు నిజమైన పరీక్ష.. ఈ సింపుల్ పజిల్‌ను 10 సెకెన్లలో సాల్వ్ చేయండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 23 , 2024 | 02:07 PM

Advertising
Advertising
<