Viral Video: అంకుల్.. ఇదేంది.. ట్రైన్‌ను ఇలా కూడా ఎక్కిస్తారా? వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో..
ABN, Publish Date - Oct 18 , 2024 | 01:55 PM
జనాలతో కిక్కిరిసిపోయే జనరల్ భోగీల్లో ప్రయాణించడం చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయాల్లో రిజర్వేషన్ దొరకడం చాలా కష్టం. దీంతో చాలా మంది జనరల్ భోగీల్లోనే అష్టకష్టాలు పడి ప్రయాణిస్తున్నారు.
బస్సు, విమానం, ఏ ఇతర వాహనంతో పోల్చుకున్నా రైలు ప్రయాణం (Train Journey) ఎంతో సౌకర్యవంతంగా, చవకగా ఉంటుంది. అయితే ఆ సౌకర్యం అనేది మీకు రిజర్వ్‌డ్ టికెట్ దొరికనప్పుడు మాత్రమే దక్కుతుంది. జనాలతో కిక్కిరిసిపోయే జనరల్ భోగీల్లో ప్రయాణించడం చాలా ఇబ్బందులు కలిగిస్తుంది. దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయాల్లో రిజర్వేషన్ (Reservation) దొరకడం చాలా కష్టం. దీంతో చాలా మంది జనరల్ భోగీల్లోనే అష్టకష్టాలు పడి ప్రయాణిస్తున్నారు. సదరు జనరల్ భోగీల్లో సీట్లు సంపాదించేందుకు కొందరు రకరకాల ట్రిక్కులు ప్లే చేస్తారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
@BewithTamanna అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ రైలు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై ఆగి ఉంది. అందులోకి ఎక్కేందుకు చాలా మంది ప్రయాణికులు ఆపసోపాలు పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి ఎమర్జెన్సీ విండో ద్వారా ఒక అబ్బాయిని రైలు లోపలికి తోశాడు. ఆ తర్వాత అక్కడ నిలబడి ఉన్న ఒక మహిళను ఎత్తుకొని రైలులోకి పంపించాడు. తర్వాత అదే కిటికీ ద్వారా తమ లగేజీ బ్యాగులను కూడా ఒక్కొక్కటిగా లోపలికి పంపించాడు. అతని తీరును అదే ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ``రైలులో సీటు సంపాదించేందుకు మంచి ఉపాయం`` అని పేర్కొన్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా తక్కువ సమయంలో వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``రైలు కూడా ఇలా ఎక్కుతారా``, ``తన వాళ్లను ఎక్కించాడు. అతను ఆ రైలు ఎక్కగలడా``, ``సరిపడినన్ని రైళ్లు ఎప్పుడూ ఉండవు``, ``అతను టిక్కెట్లు తీసుకున్నాడా``, ``సీటు కోసం అతడు ఏమైనా చేస్తాడేమో`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 18 , 2024 | 01:55 PM