ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వార్నీ.. లారీని ఇలా కూడా పార్క్ చేస్తారా?.. వీడియో చూస్తే షాక్‌తో నోరెళ్లబెట్టాల్సిందే..

ABN, Publish Date - Oct 21 , 2024 | 01:39 PM

సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫన్నీ వీడియోలు, ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎన్నో యాక్సిడెంట్ వీడియోలు కూడా చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని యాక్సిడెంట్ దృశ్యం చూస్తే షాకవ్వాల్సిందే.

A trolley on the roof of the house

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ఎక్కడ, ఎప్పుడు ఏం జరిగినా ఈ ప్రపంచానికి క్షణాల్లో తెలిసిపోతోంది. సోషల్ మీడియా ద్వారా ఎన్నో ఫన్నీ వీడియోలు, ఎన్నో ఆశ్చర్యకర వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఎన్నో యాక్సిడెంట్ వీడియోలు (Accident videos) కూడా చూసి ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని యాక్సిడెంట్ దృశ్యం చూస్తే షాకవ్వాల్సిందే. ఎందుకంటే ఆ వీడియోలో ఓ భారీ ట్రక్ (Truck) ఓ ఇంటి మీద (Roof) ల్యాండ్ అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


mahindra.ale01 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ భారీ ట్రక్కు ఓ ఇంటి పైకప్పు పైకి దూసుకెళ్లిపోయింది. ఇతర వాహనాలను, భారీ లగేజీని మోసుకెళ్లే ఓ ట్రక్కు ప్రమాదవశాత్తూ ఓ ఇంటి రూఫ్ మీదకు వెళ్లి ఆగింది. ఆ ట్రక్కు దెబ్బకు ఆ ఇంటి పైకప్పు చెల్లాచెదురైంది. ఇటుకలు, ఇతర వస్తువులు నేలపై పడి ఉన్నాయి. బహుశా ఏదైనా ప్రమాదం తర్వాత ట్రాలీ ఫ్లై ఓవర్ గుండా వెళ్లి ఇంటి పైకప్పును ఢీకొట్టి ఉంటుందని చాలా మంది ఊహిస్తున్నారు. పంజాబ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆ ఘటనను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మంది వీక్షించారు. 6.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఫ్లయింగ్ జెట్ గురించి విన్నాను, ఇప్పుడు ఈ ఎగిరే ట్రక్కును చూస్తున్నాను``, ``భారీ ప్రమాదం``, ``ఆ ఇంట్లో ఉన్న వారు ఎంత షాక్‌కు గురై ఉంటారో``, ``ఫ్లై ఓవర్ పక్కన ఉండే ఇల్లు అనుకుంటా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 21 , 2024 | 01:39 PM