ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఇదెక్కడి ఇల్లురా బాబూ.. ఇలా ఎందుకు కట్టారబ్బా అని ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వీడియో వైరల్!

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:41 PM

ఎవరైనా తమ ఇంటిని అందంగా, అద్భుతంగా కట్టుకోవాలనుకుంటారు. తమ అవసరాలకు అనుగుణంగా ఇల్లు ఉండాలనుకుంటారు. తమకు అందుబాటులో ఉన్న స్థలంలోనే వీలైనంత విలాసవంతంగా ఇల్లు కట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా విచిత్రంగా ఆలోచిస్తారు.

2 Feet House

ఎవరైనా తమ ఇంటిని (House) అందంగా, అద్భుతంగా కట్టుకోవాలనుకుంటారు. తమ అవసరాలకు అనుగుణంగా ఇల్లు ఉండాలనుకుంటారు. తమకు అందుబాటులో ఉన్న స్థలంలోనే వీలైనంత విలాసవంతంగా ఇల్లు కట్టుకుంటారు. అయితే కొందరు మాత్రం చాలా విచిత్రంగా ఆలోచిస్తారు. చూసే వారు ఆశ్చర్యపోవాలనుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ గోడ లాంటి ఇల్లు (2 Feet House) సోషల్ మీడియా జనాలకు షాక్ కలిగిస్తోంది. కేవలం 2 అడుగుల వెడల్పు ఉన్న స్థలంలో ఓ వ్యక్తి ఇల్లు కట్టాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది (Viral Video).


pascalinfratech అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఇల్లు కనిపిస్తోంది. దాదాపు ఒకటిన్నర నుంచి రెండు అడుగుల వెడల్పు మాత్రమే ఉన్న స్థలంలో గోడ లాంటి ఆకారంతో ఇల్లు కట్టారు. పొడవు మాత్రం దాదాపు 50 మీటర్ల వరకు ఉంది. రెండు అంతస్థులుగా ఉన్న ఇంటికి కేవలం బాల్కనీలు మాత్రమే ఉన్నాయి. అంతకు మించి ఇంకేమీ లేవు. అసలు ఆ నిర్మాణం ఎందుకు చేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను దాదాపు 5 కోట్ల మంది వీక్షించారు. 5.5 లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఓనర్ డబ్బు ఇవ్వకపోడంతో ఇంజినీర్ సగం కట్టేసి వెళ్లిపోయి ఉంటాడు``, ``ఈ ఇల్లు చాలా త్వరగా పూర్తై ఉంటుంది``, ``ఇల్లు పడగొట్టగా మిగిలిన గోడలా ఉంది``, ``ఈ నిర్మాణం ఎందుకు ఉపయోగపడుతుంది`` అంటూ ఫన్నీగా కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నది ఒడ్డున నడుస్తున్న కుక్క.. హఠాత్తుగా నీళ్లలోంచి వచ్చిన మొసలి ఏం చేసిందంటే..


Viral Video: వామ్మో.. ధైర్యవంతులైతేనే ఈ వీడియో చూడండి.. కింగ్ కోబ్రా భయంకర రూపం చూస్తే నివ్వెరపోవాల్సిందే..!


Viral: ఛీ..ఛీ.. మార్చురీలో ఇదేం పని.. 75 శవాల మధ్య అసభ్యకర స్థితిలో కెమెరాకు చిక్కిన జంట.. వీడియో తీస్తున్నా..


Viral Video: అదృష్టం బాగుంటే ఎవ్వరూ ఏం చేయలేరు.. ఆ కుర్రాడు ఎంత పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడో చూడండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 24 , 2024 | 01:41 PM

Advertising
Advertising
<