Viral Video: ఆ టీచర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. పిల్లల సంతోషాన్ని క్యాప్చర్ చేసేందుకు ఆమె ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Apr 30 , 2024 | 04:53 PM
అభం శుభం తెలియని స్వచ్ఛమైన పిల్లలను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. వారితో ఆడుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా మర్చిపోగలుగుతాం. నిరంతరం ఆడుతూ, తుళ్లుతూ గడిపే పిల్లల నవ్వులకు విలువ కట్టలేం. తమ పాఠశాల విద్యార్థుల నవ్వులను క్యాప్చర్ చేసేందుకు ఓ టీచర్ అమోఘమైన ట్రిక్ ఉపయోగించింది.
అభం శుభం తెలియని స్వచ్ఛమైన పిల్లలను (Kids) చూస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది. వారితో ఆడుకుంటే ఎంత పెద్ద సమస్యనైనా మర్చిపోగలుగుతాం. నిరంతరం ఆడుతూ, తుళ్లుతూ గడిపే పిల్లల నవ్వులకు విలువ కట్టలేం. తమ పాఠశాల విద్యార్థుల నవ్వులను క్యాప్చర్ చేసేందుకు ఓ టీచర్ (Teacher) అమోఘమైన ట్రిక్ ఉపయోగించింది. తమిళనాడులోని మోంటిస్సోరీ స్కూల్‌కు చెందిన టీచర్ నేల మీద జారుతూ పిల్లల నవ్వులను వీడియో తీసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
salem_mehendhi అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో మాంటిస్సోరీ స్కూల్‌కు చెందిన పలువురు పిల్లలు మెట్ల మీద వరుసగా కూర్చుని నవ్వుతున్నారు. వారి నవ్వులను వీడియోలో బంధించేందుకు వారి టీచర్ నేల మీద పడుకుని సెల్‌ఫోన్ పట్టుకుంది. వేరే టీచర్ ఆమె కాళ్ల పట్టుకుని లాక్కుంటూ వెళ్లింది. దీంతో పిల్లలందరి నవ్వులనూ ఆ టీచర్ క్యాప్చర్ చేయగలిగింది. ఆ వీడియో చాలా క్యూట్‌గా ఉంది.
ఈ క్యూట్ వీడియోకు కోట్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ వీడియోను 16 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఆమె అంకిత భావాన్ని మెచ్చుకోవాల్సిందే``, ``పిల్లల నవ్వుల విలువ ఆమెకు తెలుసు``, ``ఆమె గొప్ప టీచర్``, ``ఆమె టీచర్ ఆఫ్ ది ఇయర్``, ``సో స్వీట్ టీచర్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అలా కనిపిస్తున్నారు కానీ, వీళ్లు మామూలు దొంగలు కారు.. వీరి మోసం ఏ రేంజ్‌లో ఉంటుందంటే..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 30 , 2024 | 04:53 PM