Viral News: షాకింగ్ ఘటన.. రెస్టారెంట్‌లో గట్టిగా తుమ్మాడు.. తీరా చూస్తే ప్రేగులు..
ABN, Publish Date - Jun 11 , 2024 | 08:54 AM
తుమ్ములు.. ఇవి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుంటాయి. కొందరు చిన్నగా తుమ్మితే.. మరికొందరు మాత్రం బిగ్గరగా తుమ్మేస్తారు. ఇలా ఫోర్స్‌గా తుమ్ములు వచ్చినప్పుడు.. కళ్లు తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది..
తుమ్ములు.. ఇవి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వస్తుంటాయి. కొందరు చిన్నగా తుమ్మితే.. మరికొందరు మాత్రం బిగ్గరగా తుమ్మేస్తారు. ఇలా ఫోర్స్‌గా తుమ్ములు వచ్చినప్పుడు.. కళ్లు తిమ్మిరెక్కినట్టు అనిపిస్తుంది. చెవులు కూడా మూసుకుపోయి, అదేదో తెలియని మైకంలోకి వెళ్లిపోతాం. కొన్ని క్షణాల పాటు మనం నియంత్రణలోనే ఉండలేం. ఏదేమైనా.. కాసేపటికే తిరిగి కోలుకుంటాం. కానీ.. ఓ వ్యక్తికి మాత్రం అనూహ్య అనుభవం ఎదురైంది. అనుకోకుండా తనకు తుమ్ము రావడంతో.. కంట్రోల్ చేసుకోలేక గట్టిగా తుమ్మేశాడు. దాని దెబ్బకు.. పొట్ట చీల్చుకొని ప్రేగులు బయటకు వచ్చేశాయి. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి (63) తన భార్యతో కలిసి ఓ రెస్టారెంట్‌కి వెళ్లాడు. అక్కడ తనకు ఇష్టమైన బ్రేక్‌ఫాస్ట్ ఆర్టర్ చేసి తింటున్న సమయంలో.. అతనికి సడెన్‌గా ఒక పెద్ద తుమ్ము వచ్చింది. అనంతరం దగ్గు కూడా వచ్చింది. అప్పుడు అతను వెంటనే.. తన పొత్తి కడుపు భాగమంతా రక్తంతో తడిచిపోయి ఉండటాన్ని గమనించాడు. ఆ నొప్పిని భరించలేక అతను విలవిలలాడిపోయాడు. అసలు ఈ నొప్పికి కారణమేంటి? అని పరిశీలిస్తే.. అతని పొట్ట భాగాన్ని చీల్చుకొని, పెద్ద ప్రేగులు బయటకు రావడాన్ని గుర్తించాడు. ఈ దృశ్యం చూసి అతని భార్య ఖంగుతింది. వెంటనే అంబులెన్స్‌కి ఫోన్ చేసింది. మరోవైపు.. అంబులెన్స్ వచ్చేదాకా బయటకొచ్చిన తన పేగుల్ని ఆ వ్యక్తి చొక్కాతో కప్పి ఉంచాడు. అక్కడికి అంబులెన్స్ రాగానే.. హుటాహుటిన ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు బాధితుడికి చికిత్స అందించారు. పొట్ట చీల్చుకొని వచ్చిన ప్రేగుల్ని సరిగ్గా అమర్చి, ఎనిమిది కుట్లు వేశారు. ఇది అత్యంత అరుదైన కేసు అని, ఇప్పుడు అతని పొట్ట తెరుచుకునే అవకాశమే లేదని వైద్యులు తెలిపారు. అదృష్టవశాత్తూ.. రక్తం ఎక్కువగా బయటకు రాకపోవడంతో ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని డాక్టర్లు చెప్పారు. కాగా.. అతని పొట్ట చీల్చుకొని బయటకు ప్రేగులు రావడానికి ఓ కారణం ఉంది. నిజానికి.. ఆ వ్యక్తి కొంతకాలం నుంచి ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. కొన్నిరోజుల క్రితమే అతను ఉదర శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. అతనికి తుమ్ము గట్టిగా రావడంతో.. మూడు అంగుళాల కుట్లు తెగి, ఇలా ప్రేగులు బయటకొచ్చాయి.
Read Latest Viral News and Telugu News
Updated Date - Jun 11 , 2024 | 09:38 AM