మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: బాయ్‌ఫ్రెండ్ చెప్పాడని ఆ పని చేసింది.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్!

ABN, Publish Date - Apr 27 , 2024 | 05:03 PM

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవ్వరూ పసిగట్టలేరు. కొందరు రేయింబవళ్లు కష్టపడినా దొరకని అదృష్టం.. మరికొందరిని ఏం చేయకపోయినా వరిస్తుంది. స్వయంగా అదే వెతుక్కొని వచ్చి మరీ తలుపు తడుతుంది. ఇప్పుడు ఓ మహిళ విషయంలో కూడా అదే జరిగింది.

Viral News: బాయ్‌ఫ్రెండ్ చెప్పాడని ఆ పని చేసింది.. తీరా చూస్తే మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్!
US Woman Hits 41 Lakh Jackpot After Boyfriend Advice

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వరిస్తుందో ఎవ్వరూ పసిగట్టలేరు. కొందరు రేయింబవళ్లు కష్టపడినా దొరకని అదృష్టం.. మరికొందరిని ఏం చేయకపోయినా వరిస్తుంది. స్వయంగా అదే వెతుక్కొని వచ్చి మరీ తలుపు తడుతుంది. ఇప్పుడు ఓ మహిళ విషయంలో కూడా అదే జరిగింది. తన బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సలహా మేరకు ఆమె ఓ పని చేయడం వల్ల.. రాత్రికిరాత్రే లక్షాధికారి అయ్యింది. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


నాలుగేళ్ల తర్వాత ఇంటికొచ్చిన భర్త.. తమ్ముడితో భార్యను అలా చూసేసరికి..

అమెరికాలోని (America) మేరీలాండ్‌కు (Maryland) చెందిన బ్రెన్ (Bren) అనే మహిళ.. ఇటీవల లారెల్‌లోని వీస్ మార్కెట్స్‌లో $10 వెచ్చించి, ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. నిజానికి.. లాటరీల మీద ఆమెకు ఎలాంటి నమ్మకం లేదు. కానీ.. ప్రియుడి విజ్ఞప్తి మేరకు ఆ టికెట్ కొనింది. ‘అదృష్టం వరిస్తుందేమో, ఓసారి ప్రయత్నించి చూడు’ అని బాయ్‌ఫ్రెండ్ చెప్పడంతో.. ఏదో సరదా కోసం ఆ టికెట్ తీసుకుంది. అనంతరం ఇంటికెళ్లి తన లాటరీ గీయగా.. తనకు లాటరీ తగిలినట్లు తేలింది. తనకు నమ్మకం కుదరకపోవడంతో.. మేరీలాండ్ లాటరీ యాప్‌లో తన టికెట్‌ని పలుసార్లు తనిఖీ చేసింది. ఫైనల్‌గా తనకు 50,000 డాలర్ల లాటరీ (భారత కరెన్సీలో సుమారు రూ.41 లక్షలు) తగిలిందని తెలిసి.. ఎగిరి గెంతులేసింది.

నాకు చోటు దక్కకపోతే ఆ పని చేస్తా.. శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు

బ్రెన్ ఈ ఆనందాన్ని మీడియాతో పంచుకుంటూ.. తనకు లాటరీ తగిలిందన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని, తనని బంపరాఫర్ వరించిందన్న విషయం తెలియగానే పొరుగింటి వారు వినేంత బిగ్గరగా అరిచానని తెలిపింది. తాను చాలా సంతోషంగా ఉన్నానని, మరో ట్రక్కును కొనుగోలు చేసి తన వ్యాపారాన్ని మరింత విస్తరింపజేస్తానని పేర్కొంది. తన బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన సలహాతోనే లాటరీ కొన్నానని స్పష్టం చేసింది. కాగా.. గత నెలలోనూ యూఎస్‌లో ఓ అజ్ఞాత వ్యక్తి అక్షరాల వ్యక్తి $1.13 బిలియన్ల మెగా మిలియన్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఇది మెగా మిలియన్స్ ప్లేయర్స్‌లో గెలుపొందిన ఐదో అతిపెద్ద బహుమతి.

Read Latest Viral News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 05:03 PM

Advertising
Advertising