ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: మద్యం తాగాలంటూ భార్య వింత కండీషన్.. భర్త భరించలేక చివరకు..

ABN, Publish Date - Jul 10 , 2024 | 04:45 PM

ఎక్కడైనా భార్యలు తమ భర్తలను మద్యం తాగొద్దని గోల పెడతారు. ఎప్పుడో ఒకసారి తాగితే పట్టించుకోరు కానీ.. తరచూ తాగితే మాత్రం తీవ్రంగా మందలిస్తారు. అయితే.. ఇక్కడ సీన్ రివర్స్. స్వయంగా..

Uttar Pradesh News

ఎక్కడైనా భార్యలు తమ భర్తలను మద్యం (Alcohol) తాగొద్దని గోల పెడతారు. ఎప్పుడో ఒకసారి తాగితే పట్టించుకోరు కానీ.. తరచూ తాగితే మాత్రం తీవ్రంగా మందలిస్తారు. అయితే.. ఇక్కడ సీన్ రివర్స్. స్వయంగా భార్యే మద్యం తాగుతూ.. తన భర్తను మద్యం తాగమంటూ విసిగించింది. ఒకవేళ నిరాకరిస్తే.. అతడిని వేధించేది. చివరకు భార్య వేధింపులు తాళలేక ఆ భర్త ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆమెని వదిలించుకోవడం కోసం కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన ఓ జంటకు కొన్నాళ్ల క్రితమే వివాహం అయ్యింది. మొదట్లో రెండు, మూడు రోజుల వరకు అంతా బాగానే ఉంది కానీ.. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. తొలుత తామిద్దరం కలిసి మద్యం సేవిద్దామని భార్య కోరినప్పుడు.. అందుకు భర్త సరేనని ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించి, సరదాగా గడిపారు. కానీ.. ఆ మరుసటి రోజు నుంచి భార్య తన విశ్వరూపం చూపించడం మొదలుపెట్టింది. తాను రోజూ మద్యం తాగుతూ.. భర్తను కూడా మద్యం తాగమని బలవంతం చేసింది. తన వల్ల కాదని భర్త వేడుకున్నా.. తప్పకుండా తాగాల్సిందేనని తెగేసి చెప్పింది. ఏదో ఒక రోజు భార్యలో మార్పు రాకపోదా.. అని ఆమె టార్చర్‌ని కొన్ని రోజులపాటు భరించాడు.


రెండు నెలలు గడిచినా భార్యలో మార్పు రాకపోవడంతో.. భర్త విసిగిపోయి ఆమెను అత్తారింట్లో వదిలేసి వచ్చాడు. ఆపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం, భర్త కోర్టు మెట్లు ఎక్కడంతో.. చివరకు వ్యవహారం విడాకుల దాకా వెళ్లింది. పోలీసులు ఆ ఇద్దరి గొడవను ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రానికి తరలించారు. అక్కడా ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తన భార్య రోజూ మద్యం తాగుతూ తనని కూడా తాగమని బలవంతం చేస్తోందని, తాను తాగలేనని భర్త ఆరోపించాడు. ఈ ఆరోపణల్ని భార్య అంగీకరించింది కానీ, భర్త తనని కొట్టి ఇంటి నుంచి గెంటేశారని ఆరోపించింది. ప్రస్తుతం కౌన్సిలర్ ఆ ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నిరోజుల సమయం ఇచ్చారు.

Read Latest Viral News and Telugu News

Updated Date - Jul 10 , 2024 | 04:45 PM

Advertising
Advertising
<