Viral Video: ఈ కుర్రాడి ధైర్యం చూసి ఆశ్చర్యపోవాల్సిందే.. ప్రమాదకర పాముతో ఎలా ఆడుతున్నాడో చూడండి..
ABN , Publish Date - Feb 07 , 2024 | 05:26 PM
సోషల్ మీడియా వ్యూస్ కోసం అభం శుభం తెలియని చిన్న పిల్లల ప్రాణాలను కూడా కొందరు తల్లిదండ్రులు ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలా మందికి వ్యూస్, లైక్స్ కోసం ఆరాటం విపరీతంగా పెరిగిపోతోంది. సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయ్యేందుకు ఏం చేయడానికైనా వెనుకాడడం లేదు. ఆ క్రమంలో అభం శుభం తెలియని చిన్న పిల్లల (Toddlers) ప్రాణాలను కూడా కొందరు తల్లిదండ్రులు ప్రమాదంలో పడేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో ఓ కుర్రాడు ఓ కింగ్ కోబ్రాతో (King Cobra) ఆడుకుంటున్నాడు.
sonu.k1489 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో చిన్న కుర్రాడు ఓ ప్రమాదకర నాగుపాముతో ఆడుతున్నాడు. పాము పడగను పట్టుకున్నాడు, అలాగే దాని నోట్లో చేయి పెట్టడానికి ప్రయత్నించాడు (Toddler playing with Snake). అయినా ఆ పాము ప్రశాంతంగా ఉంది. ఆ పాముతో కుర్రాడు ఆడుకుంటుండగా అతడి తల్లిదండ్రులు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది (Snake Video).
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు మిలియన్ల మంది వీక్షించారు. 5.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఆ కుర్రాడి తల్లిదండ్రులు చాలా క్రూరులు``, ``ప్రతి ఒక్కరి జీవితం చాలా ముఖ్యమైనదే``, ``కొన్ని లైక్స్ కోసం ఇంత సాహసం ఎందుకు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.