Mount Everest: అయ్యబాబోయ్.! అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ మొదలైందా? ఎవరెస్ట్ వీడియో వైరల్!
ABN, Publish Date - May 28 , 2024 | 02:53 PM
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం.. చుట్టూ ఎటు చూసినా దట్టమైన మంచు.. ఎముకలు కొరికే చలి.. పైకి వెళ్లే కొద్ది తగ్గిపోయే ప్రాణవాయువు.. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని వైనం.. హిమాలయాల్లో అంతెత్తున ఉండే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం.. చుట్టూ ఎటు చూసినా దట్టమైన మంచు.. ఎముకలు కొరికే చలి.. పైకి వెళ్లే కొద్ది తగ్గిపోయే ప్రాణవాయువు.. ఎక్కడ ఏ ప్రమాదం పొంచి ఉందో తెలియని వైనం.. హిమాలయాల్లో అంతెత్తున ఉండే ఎవరెస్ట్ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించే పర్వతారోహకులకు ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. అయినా వారు అవేమీ లెక్క చేయడం లేదు. వాతావరణం అనుకూలిస్తే చాలు ఎవరెస్ట్ శిఖరం వైపు నడక సాగిస్తున్నారు (Traffic jam on Mount Everest ). దీంతో అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ మొదలైపోయింది (Viral Video).
everester.raj అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ అయిన ఓ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. రాజన్ ద్వివేది అనే ఔత్సాహికుడు ఈ నెల 19వ తేదీన ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించాడు. 20వ తేదీన తిరుగు ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో అతడికి ఓ భారీ క్యూలైన్ కనిపించింది. సుమారు 500 మంది పర్వతారోహకులు తనకు ఎదురుగా రావడాన్ని గుర్తించి వీడియో తీశాడు. ఎవరెస్ట్ అధిరోహించడం జోక్ కాదు అని పేర్కొంటూ.. తనకు ఎదురైన వారిలో బహుశా 250 మంది మాత్రమే విజయవంతంగా శిఖరాన్ని చేరుకోగలరని పేర్కొన్నాడు (Viral Video).
పర్వతారోహకులంతా తాళ్ల సాయంతో పైకి ఎక్కేందుకు ఒకే వరుసలో వస్తుండటం ఆ వీడియోలో కనిపించింది. రద్దీ కారణంగా కిందకు దిగడం తనకు చాలా కష్టంగా అనిపించిందని పేర్కొన్నాడు. కాగా, 1953లో తొలిసారి ఎవరెస్ట్ పర్వతారోహణ జరిగింది. అప్పట్నుంచి ఇప్పటివరకు సుమారు 7 వేల మంది మాత్రమే శిఖరంపైకి చేరుకున్నారు. కాగా, పర్యాటకులు అందరూ కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా కలుషితం చేస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Telangana Police: డయల్ 100కు పెరిగిన కాల్స్ తాకిడి.. ఇంట్లోకి కుక్క వచ్చిందంటూ ఫోన్ చేసిన వ్యక్తి!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 28 , 2024 | 02:53 PM