ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: వరుసగా ఐదో సారీ అలాగే జరగడంతో మండిపడ్డ స్టార్ కమెడియన్.. ఎయిర్‌లైన్స్‌పై గుస్సా!

ABN, Publish Date - Feb 26 , 2024 | 08:04 PM

ఇండిగో విమానం బయలుదేరడంలో జాప్యం జరగడంతో స్టార్ కమెడియన్ వీర్ దాస్ నెట్టింట పంచ్‌లు పేల్చారు.

ఇంటర్నెట్ డెస్క్: ఇండిగో (IndiGo) విమానం బయలుదేరడంలో జాప్యం (Flight Delay) జరగడంతో స్టార్ కమెడియన్ వీర్ దాస్ (Vir Das) నెట్టింట పంచ్‌లు పేల్చారు. ఆయన విమర్శనలు వైరల్‌గా (Viral) మారడంతో స్పందించిన సంస్థ తామూ ఏం చేయలేకపోతున్నామంటూ చేతులెత్తేసింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట చర్చనీయాంశమవుతోంది.

తాను ఎక్కాల్సిన విమానం ఇలా ఆలస్యం కావడం ఐదో సారి వీర్ దాస్ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రయాణికులను టైంకు గమ్యస్థానానికి చేరుస్తామని చెబుతున్న సంస్థ ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టేసి.. చివరకు దిగాల్సిన టైంలో బయలుదేరే స్థితికి ఎప్పుడు చేరుకుందని ఆయన ప్రశ్నించారు.

Viral Video: ప్రపంచానికి కావాల్సింది నీలాంటోళ్లే బ్రో..! బార్బర్ పనితో బుడ్డోడి ముఖం వెలిగిపోయిందిగా..!


ఈ ట్వీట్ వైరల్ కావడంతో అనేక మంది నెటిజన్లు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అనేక ఎయిర్‌లైన్స్ విషయంలో నిత్యం ఇలాగే జరుగుతోందంటూ కామెంట్స్ చేశారు. కొందరు తమ గతానుభవాలను ప్రస్తావిస్తూ ఇండిగోపై విమర్శలు గుప్పించారు.

వీర్ దాస్ విమర్శలు వైరల్ కావడంతో ఇండిగో సంస్థ కూడా స్పందించింది. అతడికి కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్పింది. ముంబై ఎయిర్‌పోర్టులో విమానాల రద్దీ కారణంగా టేకాఫ్ ఆలస్యమైందని చెప్పుకొచ్చింది. విమానాల రద్దీ అనేది తమ పరిధిలోని అంశం కాదని వివరించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలంటూ ముగించింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Feb 26 , 2024 | 08:07 PM

Advertising
Advertising