ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేసిన ప్యాసింజర్.. ఎందుకలా చేశాడో తెలిస్తే మైండ్ బ్లాంకే..!

ABN, Publish Date - Mar 09 , 2024 | 06:36 PM

Passenger Tossing Coins In Flight Engine: కొందరు మనుషులు ఉంటారు.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. వారు చేసే పనులు అలా ఉంటాయి మరి. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే చైనా(China)లో వెలుగు చూసింది. ఓ ప్యాసింజర్ నిర్వాకం కారణంగా.. ఏకంగా విమానం(China Southern Airlines flight) 4 గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది.

Viral News: Chinese Passenger Delays Flight 4 Hours By Tossing Coins In Engine, Here are the Details, Siva

Passenger Tossing Coins In Flight Engine: కొందరు మనుషులు ఉంటారు.. ఇలా ఉన్నారేంట్రా బాబూ అని అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. వారు చేసే పనులు అలా ఉంటాయి మరి. తాజాగా ఇందుకు నిదర్శనమైన ఘటనే చైనా(China)లో వెలుగు చూసింది. ఓ ప్యాసింజర్ నిర్వాకం కారణంగా.. ఏకంగా విమానం(China Southern Airlines flight) 4 గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. ఇంతకీ అతను ఏం చేశాడు? విమానం అంతసేపు ఆగడానికి కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ విమానం(China Southern Airlines flight) సన్యా నుంచి బీజింగ్ వెళ్లేందుకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. ఈ విమానం ఉదయం 10 గంటలకే బయలుదేరాల్సి ఉండగా.. అసాధారణమైన ఘటన కారణంగా ఆలస్యం అయ్యింది. ఓ ప్రయాణికుడు విమానం ఇంజిన్‌లోకి నాణేలను విసిరాడు. దాంతో అవి ఇంజిన్‌లో ఇరుక్కుని.. మిమానంలో సాంకేతిక సమస్యలు దారి తీసింది. అయితే, ఈ విషయం ముందుగా ఎవరికీ తెలియదు. దాదాపు 4 గంటల పాలు విమానం రన్‌వే పైనే నిలిచిపోయింది.

ఇదికూడా చదవండి: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలోనే అద్భుతం.. సరికొత్త రికార్డ్ నమోదు..!

చివరకు ఏం జరిగిందా అని విమానంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి విమానం ఇంజిన్‌లోకి కాయిన్స్ విసిరినట్లు కనిపించింది. విమాన సిబ్బంది అతన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. 5 కాయిన్స్ ఇంజిన్‌లోకి విసిరినట్లు సదరు ప్రయాణికుడు అంగీకరించాడు. దాంతో వారంతా అవక్కాయ్యారు. ఇతని కారణంగా ఉదయం 10 గంటలకే బయలుదేరాల్సిన విమానం.. మధ్యాహ్నం 2:16 గంటలకు బయలుదేరింది.

అందుకే నాణేలు విసిరాడట..

ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే.. సదరు ప్రయాణికుడు నాణేలను విమానం ఇంజిన్‌లో వేయడానికి షాకింగ్ రీజన్ చెప్పాడు. అలా నాణేలను విమానం ఇంజిన్‌లో వేస్తే అతనికి అదృష్టం వరిస్తుందట. ఆ నమ్మకం కారణంగానే.. అతను నాణేలను విమానం ఇంజిన్‌లో వేశాడట.

తీవ్రంగా స్పందించిన చైనా సదరన్ ఎయిర్‌లైన్స్..

ఈ ఘటనపై చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అనాగరిక చర్యలు సరికాదని ప్రయాణికులను హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. విమానం ఇంజిన్‌ గానీ, విమానంపై గానీ వస్తువులను విసిరేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి పేర్కొంటూ ప్యాసింజర్లను అలర్ట్ చేసింది. ఇలాంటి ఘటనలు విమానయాన భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని.. బాధ్యులైన వ్యక్తులకు కఠిన శిక్ష విధించడం జరుగుతుందని స్పష్టం చేసింది.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 07:13 PM

Advertising
Advertising