ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral News: నిద్రపోతుండగా ప్యాంట్‌లోకి దూరిన ‘తేలు’.. ఆ తరువాత సీన్ సీతారే..!

ABN, Publish Date - Mar 08 , 2024 | 02:55 PM

Viral News: కాలిఫోర్నియాలో(California) ఓ వ్యక్తి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిద్రిస్తున్న సమయంలో ప్యాంటులోకి తేలు(scorpion) దూరి వృషణాలపై కాటు వేసింది. దీనంతటికీ కారణం హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ కోర్టుకెక్కాడు బాధిత వ్యక్తి. తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు.

Man Stung by Scorpion

Viral News: కాలిఫోర్నియాలో(California) ఓ వ్యక్తి దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. నిద్రిస్తున్న సమయంలో ప్యాంటులోకి తేలు(scorpion) దూరి వృషణాలపై కాటు వేసింది. దీనంతటికీ కారణం హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యమే అంటూ కోర్టుకెక్కాడు బాధిత వ్యక్తి. తనకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశాడు. మరి ఇంతకీ అసలు ఏం జరిగిందో ఓసారి తెలుసుకుందాం..

కాలిఫోర్నియాకు చెందిన మైఖేల్ ఫర్చి అనే వ్యక్తి లాస్ వేగాస్(Las Vegas) రిసార్ట్‌లో బస చేశాడు. అయితే, రాత్రి బెడ్‌పై నిద్రిస్తుండగా అతని ప్యాంటులోకి తేలు దూరింది. అలా ప్యాంటులోకి వెళ్లిన తేలు.. అతని వృషణాలపై కాటు వేసింది. దాంతో తీవ్రమైన మంట, బాధతో బాత్రూమ్‌కు వెళ్లి చెక్ చేసుకోగా.. తేలు బయటపడింది. ‘నా ప్రైవేట్ ప్లేస్‌లో ఎవరో కత్తితో పొడిచినట్లుగా అనిపించింది. చాలా నొప్పి, మంటగా అనిపించింది. బాత్‌రూమ్‌కి వెళ్లి చెక్ చేసుకోగా.. తేలు వేలాడుతూ కనిపించింది’ అని ఫర్చి చెప్పాడు. ఇదే విషయాన్ని కోర్టుకు వివరించాడు బాధితుడు.

ఈ ఘటనకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్‌ను కూడా కోర్టుకు సమర్పించాడు. మూడు, నాలుగుసార్లు కుట్టినట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఆ మరుసటి రోజే హోటల్ నుంచి చెక్ అవుట్ చేశామని, హోటల్ రెంట్ అంతా నిర్వాహకులే చెల్లించారని అని పేర్కొన్నారు. అయితే, హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే తేలు వచ్చిందని, జరగరానిది ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనికి పరిహారం చెల్లించాల్సిందేనని పట్టుబట్టాడు బాధితుడు మైఖేల్ ఫర్చి. తేలు కుట్టడం కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం కూడా అవుతుందని వైద్యులు సైతం స్పష్టం చేశారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2024 | 02:55 PM

Advertising
Advertising