Viral News: ఒక్క ముద్దు.. ఆమెను చావు అంచుల వరకు తీసుకెళ్లింది.. ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే..
ABN, Publish Date - Dec 17 , 2024 | 07:42 PM
యుక్త వయసులో ప్రియమైన వారిని పెట్టుకునే ముద్దు ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి ముద్దు ఓ వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్తుందంటే నమ్మగలరా? లండన్‌కు చెందిన టాప్ ప్రొడ్యూసర్ ఫోబ్ కాంప్‌బెల్ హారిస్‌కు ఈ అనుభవం ఎదురైంది.
ప్రేమను వ్యక్తీకరించేందుకు అందరూ వాడే మాధ్యమం ముద్దు (Kiss). ప్రేయసీ ప్రియులే కాదు.. కూతురిని తండ్రి, కొడుకుని తల్లి ప్రేమగా ముద్దు పెట్టుకుంటారు. ఇక, యుక్త వయసులో ప్రియమైన వారిని పెట్టుకునే ముద్దు ఇచ్చే కిక్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అలాంటి ముద్దు ఓ వ్యక్తిని చావు అంచుల వరకు తీసుకెళ్తుందంటే నమ్మగలరా? లండన్‌కు చెందిన టాప్ ప్రొడ్యూసర్ ఫోబ్ కాంప్‌బెల్ హారిస్ (Phoebe Campbell-Harris)కు ఈ అనుభవం ఎదురైంది. 28 ఏళ్ల కాంప్‌బెల్ పదేళ్ల క్రితం 18 ఏళ్ల వయసులో ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది (Kissing Allergy).
కాంప్‌బెల్ 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తన స్నేహితుడి పుట్టిన రోజు కోసం పారిస్ (Paris) వెళ్లింది. అక్కడ అందరితో కలిసి ఆహ్లాదంగా గడిపింది. ఆ తర్వాత అందరూ కలిసి ఓ క్లబ్‌కు వెళ్లారు. అక్కడ కాంప్‌బెల్‌కు ఓ యువకుడు నచ్చాడు. అతడి వద్దకు వెళ్లి మాటలు కలిపింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. ఒకరంటే ఒకరు నచ్చడంతో ఇద్దరూ ముద్దు పెట్టుకున్నారు. కొద్ది క్షణాల పాటు కాంప్‌బెల్ ఆ తొలి ముద్దును ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఆమెకు నరకం మొదలైంది. ముందు గొంతు భారంగా మారింది. ఒళ్లంతా దద్దర్లు వచ్చాయి. ఆ తర్వాత శరీరంలోని అనేక భాగాల్లో వాపు మొదలైంది. వెంటనే తన దగ్గర ఉన్న ఇంజక్షన్ తీసుకుంది. కానీ ఎలాంటి మార్పూ కనిపించలేదు.
కాంప్‌బెల్ పరిస్థితిని గమనించిన ఎవరో ఎమర్జెన్సీకి కాల్ చేసారు. సిబ్బంది వచ్చి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కాంప్‌బెల్ దాదాపు మరణం అంచున ఉంది. ఆ సమయంలో ఆమె బతుకు మీద ఆశ కూడా వదిలేసుకుంది. అయితే వైద్యులు ఆమెను కాపాడగలిగారు. కాంప్‌బెల్‌కు అనాఫిలాక్సిస్ (Anaphylaxis) అనే తీవ్రమైన అలెర్జీ ఉంది. ఈ అలెర్జీ ఉన్న వారు కొన్ని రకాల పప్పులను, పాల పదార్థాలను, కొన్ని చేపలను తినకూడదు. సాయంత్రం కొన్ని రకాల పప్పులను తిన్న అబ్బాయినే కాంప్‌బెల్‌ముద్దు పెట్టుకుంది. దీంతో ఆమె చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది.
ఇవి కూడా చదవండి..
Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్ ఏం చేసిందో చూడండి..
Viral Video: రామ.. రామ.. ఇదెక్కడి దారుణం.. హనుమాన్ ఛాలీసాకు బార్ గర్ల్స్ డ్యాన్స్ చూస్తే..
Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..
Picture puzzle Test: మీ బ్రెయిన్ షార్ప్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలో తప్పేంటో వెతికి పట్టుకోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 17 , 2024 | 07:42 PM