Viral: వయనాడ్ విషాదం ముంగిట కదిలించే ప్రేమ కథ..!
ABN, Publish Date - Aug 31 , 2024 | 02:28 PM
ప్రేమ గురించి చెప్పని కథ లేదు.. రాయని కావ్యం లేదు.. ఒక్కసారి చరిత్ర తిరగేస్తే లెక్క లేనన్ని ప్రేమ కథలు పరిచయం అవుతాయి. ప్రేమ కథలలో ఎక్కువ శాతం విషాదమే ఉంటుంది. సంతోషకరమైన ముగింపు బహుశా చాలా కొద్ది కథలలోనే ఉంటుంది. అయితే..
ప్రేమ గురించి చెప్పని కథ లేదు.. రాయని కావ్యం లేదు.. ఒక్కసారి చరిత్ర తిరగేస్తే లెక్క లేనన్ని ప్రేమ కథలు పరిచయం అవుతాయి. ప్రేమ కథలలో ఎక్కువ శాతం విషాదమే ఉంటుంది. సంతోషకరమైన ముగింపు బహుశా చాలా కొద్ది కథలలోనే ఉంటుంది. అయితే ఇటీవల కేరళ రాష్ట్రం, వయనాడ్ ప్రకృతి భీభత్సంలో ఒక ప్రేమ కథ అందరినీ కదిలిస్తోంది. నేటి కాలంలో నిజమైన ప్రేమకు నిర్వచనంగా నిలుస్తోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
ఈ ఉదయపు చెడ్డ అలవాట్ల వల్ల బరువు పెరుగుతారట..!
ఇటీవల కేరళ రాష్ట్రం వయనాడ్ లో కొండచరియలు విరిగి పడటం, వరదల కారణంగా చాలా ప్రాణ, ఆర్థిక నష్టాలు చోటు చేసుకున్నాయి. వయనాడ్ జిల్లా చూరల్మల గ్రామానికి చెందిన శృతి(24) కోజికోడ్ లోని ఆసుపత్రిలో అకౌంటెంట్ గా పనిచేస్తోంది. ఈమె పాఠశాల స్నేహితుడు జాన్సన్(27) కార్ క్లీనింగ్ కంపెనీలో పని చేస్తున్నాడు. వీరు ఇద్దరూ 10ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరివి వేర్వేరు మతాలు అయినా రెండు కుంటుంబాలు అభ్యంతరం చెప్పకపోవడంతో ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వయనాడ్ లో కొండ చరియలు విరిగి పడటంతో శృతి తల్లిదండ్రులు, చెల్లెలు సహా మొత్తం 9మంది కుటుంబ సభ్యులు మరణించారు. అంతేకాదు ఈ విపత్తులో నెల కిందట శృతి కుటుంబం కట్టుకున్న ఇల్లు, 4 లక్షల డబ్బు, 15 సవర్ల బంగారం నామరూపాల్లేకుండా పోయాయి.
పండిన అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు నిజాలు ఇవీ..!
వయనాడ్ విపత్తు వల్ల శృతికి తనకంటూ ఏమీ మిగలకుండా పోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సాధారణంగా అబ్బాయిలు వెనకడుగు వేస్తారు. ఆర్థికంగా ఏమీ లేదనే కారణంతో పెళ్లికి నిరాకరిస్తారు. కానీ జాన్సన్ మాత్రం శృతిని వదల్లేదు. విషాదం చోటు చేసుకుందని తెలియగానే జాన్సన్ హుటాహుటిన శృతి వద్దకు పరుగు తీశాడు. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఆమె వెంటే ఉన్నాడు. శృతి కుటుంబ సభ్యుల మృత దేహాలను చూడానికి మార్చురీకి వెళ్లడం నుండి ప్రధాని నరేంద్ర మోడీ సందర్శనకు వచ్చినప్పటి వరకు.. ప్రతి సందర్భంలో అతను ఆమె వెంటే ఉన్నాడు.
ఈ 6 రకాల విత్తనాలను నానబెట్టిన తర్వాతే తినాలి.. ఎందుకంటే..!
శృతి చెల్లెలు స్థానిక కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుండగా, ఆమె తల్లిదండ్రులు తేయాకు తోటలో కూలీగా పనిచేసేవారు. కొండచరియలు విరిగి పడటం వల్ల 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. విపత్తు సంభవించిన 3 గ్రామాలలో, తిరువనంతపురం నుండి 470 కిలోమీచర్ల దూరంలో జిల్లా వెంబడి ప్రవహించే చలియార్ నది నుండి సుమారు 200 సంఖ్యలో శరీర భాగాలు కనుగొనబడ్డాయి. అయితే శృతి తన తల్లి మృతదేహం కూడా లభించక పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. డియన్ఎ పరీక్ష అనంతరం తన తల్లిని ఒకచోట ఖననం చేసినట్టు తెలుసుకుంది. తన కుటుంబ సభ్యుల మృతదేహాలున్న స్మశానంలోనే తాము జీవితాంతం కలిసుంటామని శృతి, జాన్సన్ లు ప్రతిజ్ఞ చేశారు.
ఇవి కూడా చదవండి..
జాగ్రత్త.. ఈ 7 అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయ్..!
అన్నానికి బదులు ఇవి తినండి చాలు.. ఈజీగా బరువు తగ్గుతారు..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - Aug 31 , 2024 | 02:36 PM