ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: వామ్మో.. గ్రాఫిక్స్ ను తలపించే సీన్.. జపాన్ భూకంపంలో నమోదైన ఈ దృశ్యం చూస్తే..!

ABN, Publish Date - Jan 05 , 2024 | 11:54 AM

టర్కీసిరియా భూకంపం విషాదాన్ని మరువకనే మళ్ళీ జపాన్ లో భూకంపం తన ఉనికిని చాటుకుంది. అక్కడి ఓ దృశ్యం చూస్తే..

ప్రపంచాన్ని కబళించే ప్రకృతి విపత్తులలో భూకంపాలు ముఖ్యమైనవి. ఇవి చాలా అరుదు అయినా వీటి వీల్ల ఆర్థిక, ప్రాణ నష్టం ఎక్కువగానే ఉంటుంది. టర్కీ, సిరియా భూకంపం విషాదాన్ని మరువకనే మళ్ళీ జపాన్ లో భూకంపం తన ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం ఈ భూకంపానికి సంబంధించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదంతా ఇలా ఉండగా భూకంప సమయంలో రికార్డైన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా నిశ్శబ్దంగా ఉన్న భూమి ఒక్కసారిగా పైకి చొచ్చుకుని రావడం అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..

కొత్త సంవత్సరం మొదటి రోజు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున జపాన్‌లో 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది(Japan Earth Quake). ఇషికావా ప్రిఫెక్చర్‌లో భూకంప ప్రకంపనలు దేశం మొత్తాన్ని ఉలికిపాటుకు గురిచేశాయి. బుధవారం నాటికి ఈ విపత్తు వల్ల కనీసం 62 మంది మరణించినట్టు లెక్క తేలింది. రెస్క్యూ కార్మికులు భవనాల శిధిలాల కింద చిక్కుకున్న ప్రజలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక భూకంప సమయంలో రికార్డైన ఒక దృశ్యం చాలా షాకింగ్ గా ఉంది. వీడియోలో ప్రశాంతంగా ఉన్న రహదారి పక్కన ఉన్న ఫుట్ పాత్ ఏరియాలో ఒక్కసారిగా లోపలి నుండి ఎవరో పైకి తోసినట్టు చొచ్చుకురావడం కనిపిస్తుంది. ఇది సముద్రపు నీళ్లు అలల్లా లేచిన అనుభూతి ఇస్తోంది. ఫుట్ పాత్ కు ఉపయోగించిన చిన్న సిమెంట్ టైల్స్ పైకి పెచ్చులుగా ఊడుతూ కనిపిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: బెండకాయల గురించి మీకు తెలియని షాకింగ్ నిజాలివి!


ఈ భూకంప వీడియోను javyfeu అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 'భూమి శ్వాస తీసుకుంటున్నట్టు ఉంది' అని ఒకరు కామెంట్ చేశారు. 'భూమి లోపలి శిలాద్రవం బుడగ పగిలిపోవడానికి ప్రయత్నిస్తోంది' అని మరొకరు అన్నారు. 'ఈ సంఘటనను అంత దగ్గరగా ఉండి చిత్రించడం నిజంగా సాహసమే' అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఇది కూడా చదవండి: Viral: ఇది కదా నాన్నంటే.. ఓ రచయిత్రి షేర్ చేసిన పోస్ట్ చూస్తే గుండె బరువెక్కడం ఖాయం!


మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 05 , 2024 | 11:54 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising