ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: పెళ్లి సమయంలో ఈ పనేంటి.. వీడియో వైరల్..

ABN, Publish Date - Dec 01 , 2024 | 07:19 PM

పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Viral Video: ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. వధూవరుడి మధ్య తగాదాలు, స్టేజ్ పై డ్యాన్స్ లు ఇలా విచిత్రమైన సంఘటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ నవ్వులు పూయిస్తున్నాయి. తాజాగా, అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఏకంగా పెళ్లిలోనే..

పెళ్లి అంటే నూరేళ్ల బంధం. జీవితాంతం గుర్తుండిపోయే పెళ్లి వేడుకల్లో వధూవరులు ఎంతో సంతోషంగా కనిపిస్తుంటారు. అయితే, ఓ వరుడు మాత్రం తనకు పెళ్లితో ఏలాంటి సంబంధం లేనట్లుగా కనిపించాడు. ఏకంగా పెళ్లి సమయంలోనే తన ఫోన్ లో లూడో ఆడుతున్నాడు. పూజారి ఒక పక్క పెళ్లి మంత్రాలు చదువుతుంటే పెళ్లి కొడుకు మాత్రం తన వెనుక ఉన్న ఇద్దరి ఫ్రెండ్స్ తో లూడో ఆడుతున్నాడు.

పెళ్లి కంటే..

ముస్కాన్ అనే వ్యక్తి ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాదాపు 4,50,000 మంది ఈ వీడియోను వీక్షించి లైక్ ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఫన్నీ కామెంట్లు కూడా చేస్తున్నారు. పెళ్లి సమయంలో కూడా ఇదేంటి బ్రో అని, పెళ్లి కంటే తనకు లూడో గేమ్ ఎక్కువ అని, పెళ్లి కూతురు ఇంకా మండపానికి రానట్లు ఉంది.. అందుకే వరుడు పూజారి మంత్రాలు వినలేక లూడో గేమ్ ఆడుతున్నాడని ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరూ మాత్రం నువ్వేం పెళ్లి కొడుకు రా అయ్యా.. పెళ్ళి సమయంలో కూడా ఇలా ఆడుకుంటున్నావ్ అని విమర్శలు గుప్పిస్తున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 07:26 PM