ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కవితా మజాకా? ఓ చేతిలో పిల్లోడు.. మరో చేతిలో..?

ABN, Publish Date - Jun 26 , 2024 | 04:20 PM

ఏ పని అయినా ఒంటి చేత్తో చేయడం చాలా కష్టం. అయితే ఒక చేతితో పిల్లవాడిని ఎత్తుకొని.. మరి చేతితో సీసాలను పైకి ఎగరవేసి పట్టుకోవడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ పుణెలోని ఓ మహిళ ఈ తరహా విన్యాసం చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.

Pune bartender Kavita Medhar

ఏ పని అయినా ఒంటి చేత్తో చేయడం చాలా కష్టం. అయితే ఒక చేతితో పిల్లవాడిని ఎత్తుకొని.. మరి చేతితో సీసాలను పైకి ఎగరవేసి పట్టుకోవడమంటే అంత సామాన్యమైన విషయం కాదు. కానీ పుణెలోని ఓ మహిళ ఈ తరహా విన్యాసం చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ స్పీడ్‌తో దూసుకుపోతుంది. పుణెలోని బార్టెంటర్ కవిత మేడర్ పచ్చ చీర కట్టుకొని.. ఒక చేతిలో పిల్లవాడిని ఎత్తుకుంది.

మరో చేతితో రెండు సీసాలను పైకి ఎగరవేసి.. కింద పడకుండా వాటిని సునాయాసంగా పట్టుకొంటుంది. అంతేకాదు మండుతున్న సీసాను సైతం అవలీలగా పైకి ఎగరవేసి.. తన అరచేతి మీద.. అలాగే అర చేతి వెనుక భాగంపై సులువుగా వాటిని నిలుపుతొంది. ఓ వైపు కవిత ఈ విన్యాసాలు చేస్తుంటే.. మరోవైపు పుష్పా 2 సినిమాలోని హిందీ పాట వినిపిస్తుంది. ఇక్కడ మరో విశేషమేమింటే ఓ చేతితో ఆమె ఇలా విన్యాసాలు చేస్తుంటే.. మరో చేతిలో ఉన్న పిల్లవాడు మాత్రం ఏ మాత్రం అదురు బెదురు లేకుండా కళ్లప్పగించి చూస్తున్నాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.3 మిలియన్ల మంది వీక్షించారు.

Also Read: AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు


అంతేకాదు.. కవిత మేడర్ చేసే ఈ విన్యాసాలపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తమ పిల్లలు కారణంగా తాము ఏమి చేయలేక పోతున్నామని పలువురు మహిళలు అంటు ఉంటారని.. అలాంటి వారికి ఈ కవిత వీడియో స్పూర్తి నింపుతుందని పేర్కొన్నారు. మరొకరు అయితే ఏం టాలెంట్ అంటూ ఆమెను ప్రశంసించారు. గుడ్ జాబ్ అంటూ మరో నెటిజన్‌ కవితను ఉత్సాహపరిచారు. సూపర్ అక్కా అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు గుడ్ మమ్ అని కామెంట్ చేశారు. ఇంకొకరు అయితే చాలా బాగుందని కవితకు కితాబు ఇచ్చారు. కవిత బి.కామ్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ కొద్ది రోజులకే తన సమీప బంధువు రాజ్ మేడార్ ద్వారా ఈ బార్టెండింగ్‌ని నేర్చుకుంది. బార్టెండింగ్‌లో బార్టెండర్లు.. సీసాలతో క్లిష్టమైన, అతిక్లిష్టమైన విన్యాసాలు చేస్తూ ఉంటారన్న సంగతి అందరికీ తెలిసిందే.

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 04:21 PM

Advertising
Advertising