ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: మీకు తెలుసా? ఉత్తర కొరియా ప్రజలు జీన్స్ ధరించరు.. ఎందుకంటే..!

ABN, Publish Date - Aug 23 , 2024 | 06:24 PM

ప్రపంచం నలుమూలల ప్రతి దేశంలో ప్రజల దగ్గరున్న దుస్తులలో జీన్స్ దుస్తులు కొద్దో గొప్పో ఖచ్చితంగా ఉంటాయి. నేటి ఫ్యాషన్ లో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న జీన్స్ ను ఉత్తర కొరియా ప్రజలు మాత్రం ధరించరు.

North Korea Vs Jeans

ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో జీన్స్ ఎక్కువగా ధరిస్తారు. జీన్స్ చిన్న పిల్లల నుండి సీనియర్ సిటిజన్ల వరకు ప్రతి ఒక్కరూ ధరిస్తారు. ఒకప్పుడు అబ్బాయిలకు మాత్రమే పరిమితమైన జీన్స్ ను ఇప్పుడు అమ్మాయిలు కూడా ధరిస్తున్నారు. ప్రపంచం నలుమూలల ప్రతి దేశంలో ప్రజల దగ్గరున్న దుస్తులలో జీన్స్ దుస్తులు కొద్దో గొప్పో ఖచ్చితంగా ఉంటాయి. నేటి ఫ్యాషన్ లో చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న జీన్స్ ను ఉత్తర కొరియా ప్రజలు మాత్రం ధరించరు. ఇది వినడానికి చాలా వింతగానూ, కామెడీగానూ అనిపించినా దీని వెనుక కారణాలు తెలిస్తే విస్తుపోతారు. దీని గురించి తెలుసుకుంటే..

Health Tips: ఈ మూడు టిప్స్ ఫాలో అయితే చాలు.. ఎంత స్లిమ్ అవుతారంటే..!



జీన్స్ ఎందుకు ధరించరు..

ఉత్తర కొరియన్లు జీన్స్ ధరించక పోవడానికి కారణాలు తెలుసుకోవాలంటే రెండవ ప్రపంచ యుద్దానికి, 20 వ శతాబ్దానికి మధ్య గల చరిత్రను తెలుసుకోవాలి. కొరియా రెండు వేర్వేరు దేశాలుగా విభజించబడింది. ఉత్తర కొరియా , దక్షిణ కొరియాలుగా విభజించడ్డాక ఈ రెండు దేశాలు ప్రపంచ అగ్ర రాజ్యాలను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. కిమ్ ఇల్-సంగ్ నేతృత్వంలో ఉత్తర కొరియా, సోవియట్ యూనియన్, చైనాలతో బలమైన సంబంధాలు ఏర్పరుచుకున్నాయి. ఈ క్రమంలోనే కమ్యూనిస్ట్ సిద్దాంతాలు రూపొందించబడ్డాయి. అయితే దక్షిణ కొరియాకు యునైటెడ్ స్టేట్స్ బలమైన మిత్రదేశంగా మారింది. ఈ కారణంగానే యునైటెడ్ స్టేట్స్ తో సంబంధం ఉన్న ఏ దేశానికి అయినా ఉత్తర కొరియా వ్యతిరేకంగా ఉంటూ వచ్చింది.

Horse Gram: ఉలవలు ఆహారంలో చేర్చుకుంటే జరిగేదేంటి? మీకు తెలియని షాకింగ్ నిజాలివి..!



ముఖ్యంగా ప్రచ్చన్న యుద్ద సమయంలో జీన్స్ ధరించడం పాశ్చాత్య సంస్కృతికి, ముఖ్యంగా అమెరికన్ సంస్కృతికి చిహ్నంగా మారింది. జీన్స్ ను కేవలం దుస్తులుగా కాకుండా పాశ్చాత్య సంస్కృతి, స్వేచ్ఛ, తిరుగుబాటుతనానికి చిహ్నంగా ఉత్తర కొరియా భావిస్తుంది. ఉత్తర కొరియాలో ఫ్యాషన్ కూడా పాలనా విధానాలను ప్రతిబింబించేలా ఉండాలనే నియమం ఉంది. సోషలిస్ట్ ఆదర్మాలను ప్రతిబింబించే దుస్తులు ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. పాశ్చాత్య శైలి దుస్తులు పూర్తీగా నిషేధించబడ్డాయి. మరీ ముఖ్యంగా స్కిన్నీ జీన్స్ పేరుతో శరీరానికి అతుక్కున్నట్టు ఉండే జీన్స్ ధరించడం ఉత్తర కొరియాలో పెద్ద నేరం.

జీన్స్ ధరించకూడదనే నిబంధన కఠినంగా పాటించాలనే ఉద్దేశ్యంతో వీధుల్లో పెట్రోలింగ్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. దీన్ని ఫ్యాషన్ పోలీస్ అనే పేరుతో ఏర్పాటు చేశారు. జీన్ ధరించకుండా చూడటమే కాకుండా ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఈ అధికారులు నిఘా ఉంచుతారు. ఎవరైనా జీన్స్ ను ధరించినా, అక్కడి దుస్తుల కోడ్ ను ఉల్లంఘించినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. జరిమానా లేదా బహిరంగంగా అవమానం ఎదుర్కోవాల్సి రావడం, లేదా జైలు శిక్ష కూడా ఇందులో భాగంగా ఉన్నాయి.

Sweetcorn: స్వీట్ కార్న్ అంటే ఇష్టమా? ఈ నిజాలు తెలుసా?



ఫ్యాషన్ పోలీసులు కేవలం రూల్స్ ఉల్లంఘించే వారిని పట్టుకోవడానికి మాత్రమే కాకుండా సరైన సోషలిస్ట్ విధానం అమలు జరిగేలా అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తారట. ఉత్తర కొరియాలో ధరించే దుస్తులు ఫ్యాషన్ లో భాగం మాత్రమే కాదు.. అక్కడి పాలన పట్ల విధేయతను కూడా చూపుతుందని అక్కడి వారి అభిప్రాయం. ఉత్తర కొరియాలో జీన్స్ నిషేధం ఒక ఉదాహారణ మాత్రమేనని, అక్కడ కిమ్ పాలన తన అధికారం పై పట్టును కొనసాగించడానికి చిన్న చిన్న వివరాలను తెలుసుకుని, ప్రజల జీవన విధానాన్ని రూపొందిస్తారని అంటున్నారు.

అవిసె గింజలు తింటే ఆడవాళ్లకు ఎన్ని లాభాలంటే..!

ఈ సమస్యలున్న వారు పొరపాటున కూడా నిమ్మరసం తీసుకోకూడదు..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 23 , 2024 | 06:24 PM

Advertising
Advertising
<