ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన డ్రైవర్.. లారీని శుభ్రం చేస్తుండగా వచ్చిన ఆ ఒక్క అనుమానమే..

ABN, Publish Date - Mar 09 , 2024 | 07:00 PM

అదృష్టం ఎవరిని.. ఎప్పుడు.. ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. అప్పటిదాకా అన్ని రకాలుగా కష్టపడ్డ వారు.. అంతలోనే రాజభోగాలు అనుభించడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

ప్రతీకాత్మక చిత్రం

అదృష్టం ఎవరిని.. ఎప్పుడు.. ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కొందరి జీవితాలు రాత్రికి రాత్రే మారిపోతుంటాయి. అప్పటిదాకా అన్ని రకాలుగా కష్టపడ్డ వారు.. అంతలోనే రాజభోగాలు అనుభించడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఇలాంటి అనూహ్య ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వార్త ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ డ్రైవర్ రాత్రి రాత్రే లక్షాధికారి అయ్యాడు. లారీని శుభ్రం చేస్తుండగా.. అతడికి వచ్చిన ఒక్క అనేుమానమే అతన్ని ఈ స్థాయికి తెచ్చింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వార్త (Viral News) తెగ వైరల్ అవుతోంది. వర్జీనియాకు (Virginia) చెందిన ఓ వ్యక్తి లారీ డ్రైవర్‌గా (Lorry driver) పని చేస్తుండేవాడు. ఇతడు 2023 అక్టోబర్‌లో కరోలిన్ కౌంటీలోని హార్మోని రోడ్‍‌లో ఉన్న రాయల్ స్టోర్‌లో మెగా మిలియన్స్ డ్రాకు సంబంధించిన లాటరీ టికెట్లను (Lottery tickets) కొనుగోలు చేశాడు. అయితే తర్వాత అతను ఈ విషయమే మర్చిపోయాడు. ఆ టిక్కెట్లను కూడా లారీలోనే పడేశాడు. అయితే ఇటీవల ఓ రోజు రాత్రి అతను లారీని శుభ్రం చేస్తుండగా.. అతడికి పాత లాటరీ టికెట్లు కనిపించాయి. ‘‘ఎందుకైనా మంచిది.. ఓ సారి చెక్ చేసుకుంటే పోలా’’.. అనే అనుమానంతో వాటిని తీసుకుని నంబర్లను సరి చూసుకున్నాడు.

Viral News: చనిపోయిన స్నేహితుడికి ఇష్టమని.. శ్మశాన వాటికలోకి సిగరెట్లను తీసుకెళ్లిన యువకులు.. చివరకు..

అయితే ఆశ్చర్యకరంగా ఆ నంబర్ల మీద $30,000 (సుమారు రూ.25లక్షలు) లాటరీ తగలడం చూసి షాక్ అయ్యాడు. లక్షాధికారి అయ్యానన్న ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. మరుసటి రోజు సదరు లాటరీ కంపెనీ వద్దకు వెళ్లి క్లెయిమ్ చేసుకున్నాడు. ఆ డబ్బులతో తన బాకీలు చెల్లించడంతో పాటూ ఉద్యోగ విరమణ తర్వాత హాయిగా జీవించేందుకు ఖర్చు చేస్తానని సదరు డ్రైవర్ తెలిపాడు. వర్జీనియాలో గతంలోనూ ఇలాంటి ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ జనరల్ స్టోర్‌లో సోడా తాగుతూ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. తర్వాత ఏకంగా ఆమె రూ.83లక్షల లాటరీ ప్రైజ్ మనీ గెలుచుకుంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరి గురించి తెలుసుకున్న వారంతా.. ‘‘అదృష్టం అంటే వీరిదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Optical illusion: ఇందులో మొదట కనిపించిన దృశ్యమే చెప్పేస్తుంది.. మీరు రొమాంటిక్ పర్సనా.. లేక జీనియస్సా..

మరిన్ని వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 09 , 2024 | 07:04 PM

Advertising
Advertising