Viral Video: సీఏలో ఉత్తీర్ణత సాధించిన కూరగాయలమ్మే మహిళ కొడుకు.. ఆ తల్లి ఎంతో ఆనంద పడిందో చూడండి..
ABN, Publish Date - Jul 15 , 2024 | 02:35 PM
మహారాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ తాజాగా ``ఎక్స్``లో షేర్ చేసిన ఓ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబైలోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన కూరగాయలమ్ముకునే మహిళ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిన సందర్భానికి చెందిన వీడియో అది.
మహారాష్ట్ర (Maharashtra) పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రి రవీంద్ర చవాన్ (Minister Ravindra Chavan) తాజాగా ``ఎక్స్``లో షేర్ చేసిన ఓ హార్ట్ టచింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ముంబై (Mumbai)లోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన కూరగాయలమ్ముకునే (Vegetable seller) మహిళ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిన సందర్భానికి చెందిన వీడియో అది. ఆమె కొడుకు కఠినమైన సీఏ పరీక్షలో (CA Exam) ఉత్తీర్ణుడయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న మహిళ కొడుకును కౌగిలించుకుని సంతోషంలో మునిగిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటోంది (Viral Video).
ముంబైకి సమీపంలో ఉన్న డోంబివిలీ ఈస్ట్‌లోని గాంధీనగర్‌లో కూరగాయలమ్ముకునే తొంబరే అనే మహిళ కొడుకు యోగేష్‌కు చదువు పట్ల మక్కువ ఎంతో ఎక్కువ. బాగా చదువుతున్న కొడుకును ప్రోత్సహించేందుకు తొంబరే ఎంతో కష్టపడింది. యోగేష్ చదువులో రాణించి సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఛార్టెడ్ అకౌంటెంట్ హోదాను పొందాడు. ఆ విషయం చెప్పగానే కూరగాయల దుకాణంలో కూర్చున్న తొంబరే ఎంతో ఆనంద పడింది. కొడుకును కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ ఎమోషనల్ వీడియోను మంత్రి రవీంద్ర పోస్ట్ చేశారు.
``సంకల్ప బలం, కృషితో యోగేష్ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఈ అద్భుత విజయాన్ని సాధించాడు. యోగేష్ తల్లి కన్నీళ్లు మిలియన్ డాలర్ల కంటే విలువైనవి. యోగేష్ కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. యోగేష్ సాధించిన విజయానికి ఓ డోంబివ్లికర్‌గా ఎంతో గర్వపడుతున్నాన``ని మంత్రి పేర్కొన్నారు. యోగేష్ సాధించిన విజయం పట్ల నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కళ్ల ముందే నదిలో ఎలా కొట్టుకుపోయాడో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Jul 15 , 2024 | 02:35 PM