ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వామ్మో.. చూస్తే రోమాలు నిక్కబోడుచుకోవడం ఖాయం.. జింకను ఎలా మింగేసిందో చూడండి..!

ABN, Publish Date - Aug 17 , 2024 | 10:14 AM

అడవిలో ఒక బలమైన జంతువుకు ఆకలి వేసిందంటే.. ఓ బలహీన జంతువుకు ఆయువు మూడినట్టే. ఇదే ఆటవిక న్యాయం. బలవంతులదే రాజ్యం. బలవంతులకు బలహీనులు ఆహారం కావాల్సిందే. అడవిలో క్రూర మృగాల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వస్తున్నాయి.

Komodo dragon eats a dead deer

అడవిలో (Forest) ఒక బలమైన జంతువుకు ఆకలి వేసిందంటే.. ఓ బలహీన జంతువుకు ఆయువు మూడినట్టే. ఇదే ఆటవిక న్యాయం. బలవంతులదే రాజ్యం. బలవంతులకు బలహీనులు ఆహారం కావాల్సిందే. అడవిలో క్రూర మృగాల వేటకు సంబంధించిన ఎన్నో వీడియోలు (Hunting Videos) సోషల్ మీడియా ద్వారా మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో చాలా వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొమడో డ్రాగన్ (Komodo dragon) అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@AMAZlNGNATURE అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక చోట ఓ జింక (Deer) చచ్చి పడి ఉంది. అక్కడకు ఓ కొమడో డ్రాగన్ ఉంది. అది జింక శరీరాన్ని అమాంతం మింగేసింది. అంత పెద్ద జింకను కూడా మూడు గుటకల్లో స్వాహా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.7 కోట్ల మందికి పైగా వీక్షించారు. 97 వేల మందికి పైగా లైక్ చేశారు.


కాగా, కొండచిలువ తరహాలోనే కొమడో డ్రాగన్ కూడా ఇతర జంతువులను అమాంతం మింగేయగలదు. అడవిలో నక్కి ఉండి ఒక్కసారిగా జంతువులపై దాడి చేసి మింగేయడం కొమడో డ్రాగన్ స్టైల్. ఇవి దాదాపు 10 అడుగల వరకు పెరగగలవు. ఇండోనేసియాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ కొమడో డ్రాగన్లు ఎక్కువగా సంచరిస్తుంటాయి.

ఇవి కూడా చదవండి..

Viral: ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా మెసేజ్.. రూ.220 కట్ అయినట్టు ఫాస్టాగ్ మెసేజ్.. అసలేం జరిగిందంటే..


Optical Illusion: మీ కళ్ల శక్తి ఏంటో తెలుసుకోండి.. ఈ ఫొటోలో దాక్కున్న పిల్లిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: వడగళ్ల వానకు భయపడ్డ పక్షి.. ఓ ఇంటి డోర్ ముందు నిల్చుని ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2024 | 10:14 AM

Advertising
Advertising
<