Viral Video: రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడు.. ఆ పేద బాలుడి కళ్లలో సంతోషం కోసం..
ABN, Publish Date - Dec 13 , 2024 | 04:14 PM
ఓ పేద కుర్రాడి మొహంలో సంతోషం చూసేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం చాలా మందిని ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడికి ఓ వ్యక్తి సర్‌ప్రైజ్ అందించాడు. ఆ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మన దేశంలో ఇప్పటికీ పేదరికం (Poverty) తాండివస్తూనే ఉంది. పేద కుటుంబాలకు చెందిన కుర్రాళ్లు చదువు మానేసి చిన్నప్పటి నుంచే పనలు చేసుకుంటూ సంపాదిస్తున్నారు. అలాంటి ఓ పేద కుర్రాడి (Poor Boy) మొహంలో సంతోషం చూసేందుకు ఓ వ్యక్తి చేసిన ప్రయత్నం చాలా మందిని ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన పూలు అమ్ముకుంటున్న కుర్రాడికి ఓ వ్యక్తి సర్‌ప్రైజ్ (Surprise) అందించాడు. ఆ ఘటనను వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. iamhussainmansuri అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ చిన్న కుర్రాడు రోడ్డు పక్కన కూర్చుని బుట్టలో పూలు పెట్టుకుని అమ్ముకుంటున్నాడు. ఎవరూ రాకపోవడంతో నిరాశగా కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ కుర్రాడి దగ్గరకు పూలు కొనుక్కోవడానికి వచ్చాడు. పిల్లవాడి నుంచి పూలు తీసుకుని, బదులుగా అతనికి చాలా డబ్బు ఇచ్చాడు. ఆ కుర్రాడితో కొద్ది సేపు మాట్లాడిన ఆ వ్యక్తి పెద్ద బ్యాగ్ నిండా ఉన్న స్నాక్స్‌ను కూడా ఇచ్చాడు. ఇదంతా చూసి ఆ కుర్రాడు చాలా ఆనంద పడ్డాడు. ఆ విషయం గురించి తన తల్లికి చాలా ఆనందంగా చెప్పాడు. దీంతో ఆ కుర్రాడిత తల్లి కూడా హాయిగా నవ్వింది.
ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 కోట్ల మంది వీక్షించారు. దాదాపు 47 లక్షల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ``ఒకరి ఆనందానికి కారణం కావడం ఎంతో ఉత్తమైన పని``, ``ఏదో ఒక రోజు నేను కూడా ఇలాగే చేస్తాను``, ``క్యూట్ వీడియో``, ``వ్యూస్ కోసమే ఆ వీడియోను రూపొందించారు. కానీ, చాలా బాగుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో ఉన్న తప్పు ఏంటో 5 సెకెన్లలో పట్టుకోండి..
Viral Video: వామ్మో.. పచ్చి మిరప లిప్‌స్టిక్.. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ టిప్ చూస్తే మండిపోవడం ఖాయం..
Viral Video: ప్రమాదానికి హాయ్ చెప్పడం అంటే ఇదే.. రైలు గేటుకు వేలాడుతూ రీల్.. చివరకు ఆమె ఏమైందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 13 , 2024 | 04:14 PM