Chennai: తుఫాన్ ఎఫెక్ట్.. చెన్నై విమానాశ్రయంలో ల్యాండింగ్ సమయంలో అయోమయం.. తిరిగి గాల్లోకి లేచిన విమానం..
ABN, Publish Date - Dec 01 , 2024 | 04:33 PM
తుఫాను ప్రభావం వల్ల చెన్నైలో గురువారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. జన జీవనం స్థంభించిపోయింది. ఈ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. చాలా విమానలను రద్దు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విమానాశ్రయాన్ని మూసేశారు.
``ఫెంగల్`` తుఫాను (Fengal Cyclone) చెన్నైలో (Chennai) బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులతో చెన్నై వాసులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. శనివారం అర్ధరాత్రి పుదుచ్ఛేరి సమీపంలో ఈ తుఫాను తీరం దాటింది. ఈ తుఫాను ప్రభావం వల్ల చెన్నైలో గురువారం నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. జన జీవనం స్థంభించిపోయింది. ఈ ప్రభావం విమాన సర్వీసులపై కూడా పడింది. చాలా విమానలను రద్దు చేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విమానాశ్రయాన్ని (Chennai Airport) మూసేసి అర్ధరాత్రి తర్వాత కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు (Chennai Rains).
ఫెంగల్ తుఫాను విధ్వంసానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తుఫాను ధాటికి ఓ విమానం (Flight) ల్యాండింగ్ సమయంలో ఎదుర్కొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబై నుంచి చెన్నై వచ్చిన ఓ ఇండిగో (Indigo) విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో ఈదురు గాలులు వీస్తుండడంతో పైలెట్లు విమానాన్ని ల్యాండ్ చేయలేకపోయారు. దీంతో విమానం తిరిగి గాల్లోకి లేచింది. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
ఆ ఘటనపై ఇండిగో సంస్థ స్పందించింది. ``ప్రతికూల వాతావరణం, బలమైన ఈదరుగాలుల కారణంగా ల్యాండింగ్ సాధ్యం కాకపోవడంతో ముంబై-చెన్నై విమాన సిబ్బంది నవంబర్ 30వ తేదీన గో-అరౌండ్ చేశారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా పైలెట్లు గో- అరౌండ్ ప్రోటోకాల్‌ను పాటించారు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు పైలెట్లు చివరి నిమిషంలో అలాంటి నిర్ణయం తీసుకుంటారని, అది తప్పనిసరిగా పాటించాల్సిన నియమావళి`` అని ఇండిగో సంస్థ పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: అచ్చం మనిషిలాగానే పరిగెడుతున్న కోతి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Viral Video: వామ్మో.. ఇతని మీద ఇతనికి ఎంత నమ్మకమంటే.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Viral video: వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.. వరుడిని పరుగులు పెట్టించిన కుర్రాడు.. అసలేం జరిగిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 01 , 2024 | 04:33 PM