Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..
ABN, Publish Date - Dec 02 , 2024 | 12:11 PM
ఈ పెళ్లిళ్ల సీజన్‌లో సోషల్‌మీడియా ద్వారా ప్రతిరోజూ ఎన్నో వీడియోలు బయటకు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి, మరికొన్ని చిరునవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల (Wedding) సీజన్ జోరుగా సాగుతోంది. పెళ్లిళ్లలో జరిగే ఆసక్తికర ఘటనలు, ఫన్నీ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో సోషల్‌మీడియా ద్వారా ప్రతిరోజూ ఎన్నో వీడియోలు (Wedding Videos) బయటకు వస్తుంటాయి. వాటిల్లో కొన్ని వీడియోలు మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి, మరికొన్ని చిరునవ్వు తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అందులో ఓ కుక్క (Pet Dog) పెళ్లి మండపంలోకి ప్రవేశించి బీభత్సం సృష్టిస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
bridal_lehenga అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. వివాహ కార్యక్రమం జరుగుతోంది. వధువు (Bride) పీటల మీద కూర్చుని పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేస్తోంది. అప్పుడే ఓ పెంపుడు కుక్క మండపంలోకి ప్రవేశించి కళ్యాణ మండపంలో అటూ ఇటూ తిరుగుతూ బీభత్సం సృష్టించింది. కుక్కను చూసి మండపంలో ఉన్నవారు భయపడి పరుగులు తీశారు. ఆ తర్వాత ఆ కుక్క వేదిక మీదకు ఎక్కి వధువును భయపెట్టింది. వధువును చూసి అరుచుకుంటూ మీదకు వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో భయపడిన వధువు కేకలు వేసుకుంటూ అటూ ఇటూ పరుగులు పెట్టింది. ఎంతో అందంగా అలంకరించిన మండపం ఆ హడావుడిలో ధ్వంసమైంది.
అంతలో మరో వ్యక్తి అక్కడకు వచ్చి ఆ కుక్క దృష్టిని మరల్చాడు. దీంతో ఆ కుక్క అతడి వెనుక పరుగులు పెట్టింది. ఆ ఘటనను కెమెరా మ్యాన్ రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 5 లక్షల మంది వీక్షించారు. 49 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``వధువు అతిగా భయపడింది``, ``వెరీ ఫన్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..
Viral Video: ఉక్కు శరీరం అంటే ఇదేనేమో.. అతడి దెబ్బకు స్టీల్ రాడ్ ఎలా వంగిపోయిందో చూడండి..
Viral Video: యూపీ నుంచి బీహార్‌కు.. లారీ బానెట్ తెరిచి చూసిన కార్మికులకు దిమ్మదిరిగే షాక్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 02 , 2024 | 12:11 PM