Viral Video: వామ్మో.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే.. బీచ్ సందర్శకులకు పరుగులు పెట్టించిన తూనీగలు!
ABN, Publish Date - Jul 31 , 2024 | 04:28 PM
సాధారణంగా తూనీగలు చిన్న కీటకాలు. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేవు. అయితే తూనీగలను తక్కువ అంచనా వేయకూడదు. అవి తలచుకుంటూ మనుషులను పరుగులు పెట్టించగలవని తాజాగా రుజువైంది. అమెరికాలోని ఓ బీచ్‌లో సేద తీరుతున్న సందర్శకులను తూనీగలు హడలెత్తించాయి.
సాధారణంగా తూనీగలు (Dragon fly) చిన్న కీటకాలు. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించలేవు. అయితే తూనీగలను తక్కువ అంచనా వేయకూడదు. అవి తలచుకుంటే మనుషులను పరుగులు పెట్టించగలవని తాజాగా రుజువైంది. అమెరికా (America)లోని ఓ బీచ్‌లో (Beach) సేద తీరుతున్న సందర్శకులను తూనీగలు హడలెత్తించాయి. వాటి ధాటికి తట్టుకోలేక అందరూ బీచ్ నుంచి పారిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని రోడ్ ఐలాండ్‌లోని మిస్క్వామికట్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది (Viral Video).
@CollinRugg అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో సముద్ర తీరాన కొందరు వ్యక్తులు సేద తీరుతున్నారు. అంతలో తూనీగలు లక్షల సంఖ్యలో ఆ బీచ్ పైకి దూసుకొచ్చాయి. అక్కడి ఆహ్లాదకర పరిస్థితిని భయానకంగా మార్చాయి. అంత భారీ సంఖ్యలో తూనీగలను చూసి అక్కడి వారు ఆశ్చర్యపోయారు. కొందరు దాక్కునేందుకు ప్రయత్నించారు. మరికొందరు తమ వస్తువులు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతమంది అక్కడ హాయిగా నిలబడి ఈ కీటకాల గుంపును వీడియో తీస్తున్నారు. వేసవిలో సంతానోత్పత్తి సమయంలో లేదా వాతావరణ మార్పుల కారణంగా కోట్ల కొద్దీ తూనీగలు ఇలా ప్రయాణిస్తుంటాయి.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 38 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 15 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది ప్రకృత్తి విపత్తుకు సంకేతమా``, ``అక్కడ పరిస్థితి మొత్తం భయానకంగా మారింది``, ``ఇలాంటిది నా జీవితంలో చూడలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Picture Puzzle: మీ ట్యాలెంట్‌కు టెస్ట్.. ఈ హైకింగ్ ఫొటోల్లోని 3 తేడాలను 15 సెకెన్లలో కనిపెట్టండి..!
Viral News: పెంపుడు కుక్కకు అతిగా ఆహారం పెట్టినందుకు మహిళకు జైలు.. న్యూజిలాండ్ మహిళకు వింత అనుభవం!
Optical Illusion: ఈ ఫొటోలోని ``story``ని కనిపెట్టండి.. 10 సెకెన్లలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Jul 31 , 2024 | 04:28 PM