Viral Video: నాలుగు పెగ్గులు వేశాక పామైనా డోంట్ కేర్.. పాముకు తాగుబోతు ఎలాంటి షాకిచ్చాడో చూడండి..
ABN, Publish Date - Sep 18 , 2024 | 05:27 PM
ఈ ప్రపంచంలో అత్యధిక మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపామును చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాము కాటు వేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి.
ఈ ప్రపంచంలో అత్యధిక మంది పాములంటేనే (Snake) భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా జంకుతారు. ఇక, అత్యంత విషపూరితమైన నాగుపాము (Cobra)ను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. నాగుపాము కాటు వేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయి. అందుకే పాములుకు సాధ్యమైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో (Snake Video)లో ఓ మందు బాబు (Drunken Man) నాగుపాముతోనే పరాచకాలు ఆడాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
a2z_venkat అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన రాయిపై కూర్చుని మద్యం సేవిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడకు ఓ నాగుపాము వచ్చింది. అయినా అతడు బెదరలేదు. పడగ ఎత్తి కూర్చున్న నాగుపాముతోనే పరాచకాలు ఆడాడు. ఆ నాగుపాము నోటి దగ్గర చేయి పెట్టి పలుసార్లు కొట్టాడు. పెంపుడు జంతువుతో మాట్లాడినట్టు దానితో మాట్లాడాడు. అయినా ఆ పాము అతడిని ఏమీ చేయలేదు. కామ్‌గా ఉండిపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.35 కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 4 లక్షల మంది లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆ పాముకు కూడా 90 ఎమ్‌ఎల్ కావాలేమో``, ``అతడిని కుడితే ఆ పామే చచ్చిపోతుంది``, ``అతడు భయపడకపోవడంతో ఆ పాము షాక్‌లోకి వెళ్లిపోయింది``, ``ఆ పాముకు ఎలా స్పందించాలో తెలియలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: నా అందమే నా పాలిట శ్రతువుగా మారింది.. ఆవేదన వెళ్లగక్కిన హాట్ మోడల్..
Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్ వాడుకోవాలంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Sep 18 , 2024 | 05:27 PM