Viral Video: క్యూట్ వీడియో.. పెళ్లి ఊరేగింపుతో వస్తున్న వరుడిని చూడగానే వధువు ఏం చేసిందో చూడండి..
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:28 PM
పెళ్లి రోజు ఎంతో సంతోషంగా, సంబరంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా వధూవరులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి పెళ్లి రోజున వరుడి రాకను కిటికీలో నుంచి చూస్తూ ఎంతో సంతోషపడింది.
పెళ్లి (Wedding) అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. పెళ్లి రోజు ఎంతో సంతోషంగా, సంబరంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ముఖ్యంగా వధూవరులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి (Bride) పెళ్లి రోజున వరుడి (Groom) రాకను కిటికీలో నుంచి చూస్తూ ఎంతో సంతోషపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియో చూసిన వారు ఆహ్లాదకరంగా ఫీల్ అవుతున్నారు (Viral Video).
2m_iqu_mirza అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో వరుడు గుర్రం ఎక్కి పెళ్లి ఊరేగింపు (wedding procession)తో సహా కల్యాణ మండపానికి వస్తున్నాడు. అప్పటికే కల్యాణ మండపంలో ఉన్న వధువు కిటికీ దగ్గరకు వెళ్లి ఆ ఊరేగింపును సంతోషంగా వీక్షిస్తోంది. ఆ సమయంలో వరుడు, వధువును చూసి నవ్వాడు. దీంతో ఆ వధువు ఎంతో ఉత్సాహంగా వరుడికి చేతులు ఊపి అభివాదం చేసింది. ఆ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. 73 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చాలా క్యూట్ వీడియో``, ``వధువు ఎంతో సంతోషంగా ఉందో``, ``ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు ఉంది``, ``ఇది లవ్ మ్యారేజ్ అయ్యుంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral: తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ.. ఎక్స్ రే చూసి నివ్వెరపోయిన డాక్టర్..
Optical Illusion Test: మీది హెచ్డీ చూపు అయితే.. ``8``ల మధ్యనున్న ``3``ను 3 సెకెన్లలో పట్టుకోండి..
Viral: తల లేకుండా 18 నెలలు బతికిన కోడి.. తన ఓనర్కు కోట్లు ఎలా సంపాదించి పెట్టిందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 13 , 2024 | 12:28 PM