Viral Video: వీడియో కోసం ఇదేం పని.. నూతన వధువు తీరు చూస్తే కోపం రాక మానదు.. వీడియో వైరల్..
ABN, Publish Date - Nov 23 , 2024 | 10:05 AM
అమ్మాయిలకు పెళ్లితో చాలా మారతాయి. అప్పటి వరకు పెరిగిన ఇంటిని వదిలేసి భర్త ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. తల్లిదండ్రులను, చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని వదిలేసి వెళ్లడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది అమ్మాయిలు కన్నీళ్లు పెట్టుకుంటారు.
వివాహం (Wedding) అనేది ఎవరి జీవితంలోనైనా అత్యంత ముఖ్యమైన ఘట్టం. ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లితో చాలా మారతాయి. అప్పటి వరకు పెరిగిన ఇంటిని వదిలేసి భర్త ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. తల్లిదండ్రులను, చిన్నప్పటి నుంచి పెరిగిన ఇంటిని వదిలేసి వెళ్లడం ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. ఆ సమయంలో చాలా మంది అమ్మాయిలు (Bride) కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో అనుబంధాలు, భావోద్వేగాల కంటే వీడియోలు, ఫొటోలు ముఖ్యమైపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో అమ్మాయి తీరు చూస్తే ఆందోళన కలగడం సహజం (Viral Video).
flywiser1 అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ నూతన విధువు వివాహం తర్వాత పుట్టింటిని వీడాల్సిన సందర్భం. ఆ సందర్భంగా వీడియోను చిత్రీకరిస్తున్నారు. ఆ వీడియో కోసం వధువు కొద్దిసేపు ఏడ్చినట్టు నటించి తన తల్లిదండ్రులను కౌగిలించుకుంది. వెంటనే బ్యాగ్రౌండ్లో వస్తున్న పాటకు సంతోషంగా డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు చాలా అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఆ అమ్మాయి తీరు చూసి నవ్వుకున్నారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``ఇది డిజిటల్ యుగం, ప్లాస్టిక్ అనుబంధాలు``, ``ఇదెక్కడి తీరు``, ``ఆమె చాలా సంతోషంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
IQ Test: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఈ ఫొటోలో రెండు తప్పులు ఉన్నాయి.. 10 సెకెన్లలో కనుక్కోండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Nov 23 , 2024 | 10:05 AM