ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: వార్నీ.. ఇదెక్కడి పిచ్చి.. కరెన్సీ నోట్లను కాల్చడం ఏంటి.. ఎలాంటి శిక్ష పడుతుందంటే..

ABN, Publish Date - Nov 03 , 2024 | 06:34 PM

దీపావళి పర్వదినం సందర్భంగా అందరూ టపాసులను కాల్చి తమ సంబరాలను జరుపుకున్నారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వెరైటీగా ప్లాన్ చేశాడు.

Burning Currency notes,

దీపావళి (Diwali) పర్వదినం సందర్భంగా అందరూ టపాసులను కాల్చి తమ సంబరాలను జరుపుకున్నారు. ఆ వేడుకలకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వెరైటీగా ప్లాన్ చేశాడు. ఏకంగా కరెన్సీ నోట్లను (Currency Notes) కాల్చుకుని ఆనందం పొందాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


kumardineshbhai049 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రూ.100, రూ.500 కరెన్సీ నోట్లు కాలిపోతున్నట్లు కనిపిస్తోంది. దీపావళి సందర్భంగా ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో కొత్త కరెన్సీ నోట్లు మంటల్లో తగలబడిపోతున్నాయి. అయితే, ఈ వీడియో ఎక్కడిది? ఎవరు ఇలా చేశారు? అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, ఏదైనా కరెన్సీ నోటును నాశనం చేసినా, కాల్చినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.


కరెన్సీ నోట్లను కాల్చడం మన చట్టాల ప్రకారం దేశద్రోహం కిందకు వస్తుందని చెబుతున్నారు. ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇదంతా రీల్స్‌ పిచ్చితో చేసిన పని``, ``ఇతడిని శిక్షించాలి``, ``టపాసులు కాల్చడం కూడా డబ్బులను కాల్చడం లాంటిదే అని సింబాలిక్‌గా చూపించారు``, ``అవి నకిలీ నోట్లు అయి ఉంటాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..


Hijab protest: ఇరాన్‌లో హిజాబ్‌పై నిరసన.. బహిరంగంగా బట్టలు విప్పి తిరగిన మహిళ.. వీడియో వైరల్..


Optical Illusion Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితేనే.. ఈ సీతాకోక చిలుకల మధ్యనున్న చీమను పట్టుకోగలరు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 03 , 2024 | 06:34 PM