ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: బాబోయ్ ఇతను మనిషా.. మరేదైనా శక్తి ఉందా? ఏం చేశాడో మీరే చూడండి..

ABN, Publish Date - Feb 01 , 2024 | 01:18 PM

Viral Video: ఊపిరి బిగపట్టుకుని ఎంత సమయం ఉండగలరు? అదేనండీ శ్వాస తీసుకోకుండా ఎంత సమయం ఉండగలుగుతారు? సామాన్యులు మహా అయితే ఒక నిమిషం వరకు ఉండగలుగుతారు. అప్పటికే బాబోయ్ అని వెంటనే శ్వాస పీల్చుకుంటారు. లేదంటే పై ప్రాణాలు పైకే పోతాయి. ఇక రెగ్యూలర్‌గా ప్రాక్టీస్‌ చేసే వ్యక్తులైతే 2 నుంచి 3 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతారు.

Latest Viral Video

Viral Video: ఊపిరి బిగపట్టుకుని ఎంత సమయం ఉండగలరు? అదేనండీ శ్వాస తీసుకోకుండా ఎంత సమయం ఉండగలుగుతారు? సామాన్యులు మహా అయితే ఒక నిమిషం వరకు ఉండగలుగుతారు. అప్పటికే బాబోయ్ అని వెంటనే శ్వాస పీల్చుకుంటారు. లేదంటే పై ప్రాణాలు పైకే పోతాయి. ఇక రెగ్యూలర్‌గా ప్రాక్టీస్‌ చేసే వ్యక్తులైతే 2 నుంచి 3 నిమిషాలు ఊపిరి పీల్చుకోకుండా ఉండగలుగుతారు. ఇదంతా బయట సంగతి. మరి నీటి అడుగున ఊపిరి పీల్చుకోకుండా ఎంత సమయం ఉండగలరు? అంటే దాదాపు చాలా మందికి అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే.. నీటి అడుగున ఒత్తిడి పెరుగుతుంది. దాంతో ఎక్కువ సమయం ఊపిరి పీల్చుకోకుండా ఉండలేరు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఎవరూ చేయలేని సాహసం చేసి చూపించాడు. ఇంతకు ముందు ఎవరూ చేయని ఘనత సాధించి రికార్డ్ క్రియేట్ చేశాడు.

6 నిమిషాలు వాటర్‌లోనే..

2, 3 నిమిషాలు గాలి పీల్చుకోకుండా ఉండటమే కష్టం అంటే.. ఈ వ్యక్తి ఏకంగా 6 నిమిషాల పాటు నీటి అడుగున ఊపిరి బిగపట్టుకుని ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది ఒక పోటీ. స్విమ్మింగ్ పూల్ వాటర్‌ అడుగున దిగి.. ఎంత ఎక్కువ సమయం ఊపిరి పీల్చుకోకుండా ఉంటారో వారు విన్నర్. ఈ పోటీలో చాలా మంది పాల్గొన్నారు. మొదట ఓ నలుగురు వ్యక్తులు స్విమ్మింగ్ పూల్ అడుగునకు దిగారు. నీటి అడుగున ఏర్పాటు చేసిన సపోర్ట్‌ను పట్టుకుని ఆ నలుగురు ఊపిరిబిగపట్టుకుని నిల్చుకున్నారు వీరిలో ఓ ముగ్గురు నిమిషం వ్యవధిలో పైకి వెళ్లిపోయారు. ఒక వ్యక్తి మాత్రం అలాగే ఉండిపోయాడు. ఆ తరువాత మరో ముగ్గురు వచ్చారు. వారు కూడా ఎక్కువ సమయం ఉండలేకపోయారు. కానీ, ఈ వ్యక్తి మాత్రం ఏకంగా నీటి అడుగున ఊపిరి బిగపట్టుకుని 6 నిమిషాలపాటు నిల్చుని ఉన్నాడు. ఆ తరువాత తను కూడా నీటి అడుగు నుంచి బయటకు వెళ్లాడు. మొత్తానికి 6 నిమిషాల పాటు ఊపిరి పీల్చుకోకుండా ఉండి.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

వైరల్ అవుతున్న వీడియో..

ఈ షాకింగ్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో @TheFigen_ అనే IDలో పోస్ట్ చేశారు. దాంతో ఇది కాస్తా వైరల్ అయ్యింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు 18 లక్షల వ్యూస్ వచ్చాయి. వేలాది లైక్స్ వచ్చాయి. కాగా, వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అతనికి అతీంద్రీయ శక్తులు ఏమైనా ఉన్నాయా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 2, 3 నిమిషాలే గాలి పీల్చుకోకుండా ఉండటం కష్టం అంటే.. ఇతను ఏకంగా 6 నిమిషాలు ఊపిరి బిగపట్టుకుని ఉండటాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. ఈ విషయంలో కఠిన శిక్షణ తీసుకుని ఉంటాడని భావిస్తున్నారు నెటిజన్లు.

Updated Date - Feb 01 , 2024 | 01:18 PM

Advertising
Advertising