Viral Video: సింహం బోనులో చెయ్యి పెడితే.. ఓ మూర్ఖుడికి తగిన శాస్తి చేసిన మృగరాజు.. వీడియో చూస్తే..
ABN, Publish Date - Oct 06 , 2024 | 03:46 PM
సింహం అడవిలో ఉన్నా, జూలో ఉన్నా దానితో జాగ్రత్తగానే ఉండాలి. బోనులో ఉన్న సింహాన్ని చాలా మంది జనాలు తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. సింహాలు, పులులతో మూర్ఖంగా ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సింహం (Lion) అడవికి రారాజు. సింహం బలం, చురుకుదనం ముందు మరే జంతువు నిలవలేదు. సింహం అడవిలో ఉన్నా, జూ (Zoo)లో ఉన్నా దానితో జాగ్రత్తగానే ఉండాలి. బోనులో (Cage) ఉన్న సింహాన్ని చాలా మంది జనాలు తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. సింహాలు, పులులతో మూర్ఖంగా ప్రవర్తిస్తే తగిన మూల్యం చెల్లించకతప్పదు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సింహాన్ని తేలిగ్గా అంచనా వేసిన ఓ వ్యక్తి జీవితానికి సరిపడా గుణపాఠం నేర్చుకున్నాడు. సింహం అతడికి జీవితంలో మరచిపోలేని పాఠాన్ని నేర్పింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
jungle.safari.india అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం ఆ వ్యక్తి జూ సందర్శనకు వెళ్లినట్లు తెలుస్తోంది. బోనులో ఉన్న సింహాన్ని చూసి అతడికి తుంటరి ఆలోచన కలిగింది. బోను దగ్గరికి వెళ్లి లోపల చేయి పెట్టి సింహాన్ని ఆటపట్టించడం ప్రారంభించాడు. మొదట్లో సింహం అతడిని ఏమీ అనలేదు. అయినా అతడు వెనక్కి తగ్గలేదు. దీంతో సింహం నెమ్మదిగా ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి తన నోటితో అతడి చేతిని పట్టుకుంది. తన దంతాలతో అతడి చేతిని కొరికేసింది. ఎంత ప్రయత్నించినా అతడు తన చేతిని విడిపించుకోలేకపోయాడు. చివరకు ఎలాగోలా తన చేతిని బయటకు లాక్కున్నాడు. ఈలోగా సింహం అతడి చేతిని నమిలేసింది.
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోకు లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``సింహం అతడికి సరైన గుణపాఠం నేర్పింది``, ``పాపం.. ఎంత నొప్పి అనుభవించాడో``, ``అతడి చేయి ఎందుకైనా పని చేస్తుందా``, ``అతడు భారీ మూల్యం చెల్లించుకున్నాడు``, ``క్రూర మృగాలతో మూర్ఖంగా ప్రవర్తిస్తే నష్టం తీవ్రంగా ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వావ్.. సూపర్ టెక్నిక్.. ఉడికించిన బంగళాదుంపల తొక్కలను ఎంత సింపుల్‌గా తీసిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Oct 06 , 2024 | 03:46 PM