ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఈ కుర్రాడి ప్రతిభ చూస్తే నివ్వెరపోవాల్సిందే.. 25 కోట్ల మంది ఈ వీడియోను ఎందుకు చూశారంటే..

ABN, Publish Date - Sep 18 , 2024 | 05:08 PM

ప్రతిభకు వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు కూడా కఠోన సాధన చేసి అద్భుతాలు చేసి చూపించగలరు. ఎంతో అనుభవం కలిగిన వారి చేత కూడా ఔరా అనిపించగలరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోక తప్పదు.

child performs ninja style stunt

ప్రతిభకు (Talent) వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లలు (Child) కూడా కఠోన సాధన చేసి అద్భుతాలు చేసి చూపించగలరు. ఎంతో అనుభవం కలిగిన వారి చేత కూడా ఔరా అనిపించగలరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోక తప్పదు. ఆ వీడియోలోని ఓ కుర్రాడు అద్భుతంగా నింజా స్టైల్ విన్యాసాలు (Ninja style Stunt) చేశాడు. అక్కడున్న వారందరూ ఊపిరి బిగబట్టి ఆ కుర్రాడి కదలికలను చూస్తూ ఉండిపోయారు. చివరకు అతడి ప్రతిభకు ముగ్ధులయ్యారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


east_the_beast అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు ఈస్టన్ ఫ్లెచర్. ఆ కుర్రాడు బార్బడోస్‌లోని నింజా త్రోడౌన్ పోటీలో (Ninja Throwdown Competition) పాల్గొని అద్భుత ప్రదర్శన చేశాడు. టైర్ల నుంచి దూకుతూ, తాళ్ల సహాయంతో గాల్లో ముందుకు వెళుతూ.. రకరకాల మార్గాల గుండా స్వల్ప వ్యవధిలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఆ కుర్రాడి ప్రతిభను అక్కడున్న వారందరూ చప్పట్లతో అభినందించారు. ఆ వీడియోను ఫ్లెచర్ తండ్రి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 25 కోట్ల మందికి పైగా వీక్షించారు. 87 లక్షల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``చిన్న వయసులోనే ఇంతటి ప్రతిభ అమోఘం``, ``నెక్ట్స్ స్పైడర్ మ్యాన్ ఈ కుర్రాడే``, ``ఇది నిజమైన టెంపుల్ రన్``, ``ఆ కుర్రాడు భవిష్యత్తులో ఎన్నో ఘనతలు సాధించాలి``, ``ఆ కుర్రాడు అందుకోసమే పుట్టినట్టు ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral: నా అందమే నా పాలిట శ్రతువుగా మారింది.. ఆవేదన వెళ్లగక్కిన హాట్ మోడల్..


Viral Video: ట్రాక్టర్ పట్టుకెళ్లేందుకు వచ్చిన లోన్ రికవరీ ఏజెంట్లు.. వాళ్లను బెదిరించడానికి యువతి ఏం చేసిందంటే..


Viral: ఇదెక్కడి రూల్ నాయనా? బెంగళూరులోని ఆ మాల్‌లో రెస్ట్‌రూమ్‌ వాడుకోవాలంటే..


Optical Illusion: మీ బ్రెయిన్‌ స్పీడ్‌కు అసలైన టెస్ట్.. ఆ బాక్సుల మధ్య తాళం చెవి ఎక్కడుందో కనుక్కోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 18 , 2024 | 05:09 PM

Advertising
Advertising