ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: మీరూ ఇలాంటి తప్పు చేయకండి.. ఆ కార్ డ్రైవర్ చేసిన పనికి ఏకంగా రూ.2.5 లక్షల జరిమానా..

ABN, Publish Date - Nov 18 , 2024 | 01:31 PM

రోడ్డు మీద వేగంగా వెళ్తున్న అంబులెన్స్‌లో తీవ్రంగా గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న రోగి ఉండవచ్చు. అతనికి వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. లేకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. అందుకే చాలా మంది వాహనదారులు అంబులెన్స్‌కు దారి ఇచ్చేస్తుంటారు.

Not giving way to the ambulance

రోడ్డు మీద వెళ్లేటపుడు ఎవరైనా సరే ట్రాఫిక్ రూల్స్ (Traffic rules) కచ్చితంగా పాటించాల్సిందే. స్పీడ్ నిబంధనల మేరకు వాహనాన్ని నడపాలి. వెనుక అంబులెన్స్ (Ambulance ) వస్తుంటే కచ్చితంగా దారి వదలాల్సిందే. లేకపోతే జరిమానాకు గురి కావాల్సిందే. ఆ అంబులెన్స్‌లో తీవ్రంగా గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న రోగి ఉండవచ్చు. అతనికి వీలైనంత త్వరగా చికిత్స అందించాలి. లేకపోతే అతడి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుంది. అందుకే చాలా మంది అంబులెన్స్‌కు దారి ఇచ్చేస్తుంటారు (Giving way to the ambulance). అయితే కేరళ (Kerala)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అలా చేయలేదు. ఆ వీడియో వైరల్ కావడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది (Viral Video).


@coolfunnytshirt అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ అంబులెన్స్ రోడ్డుపై వేగంగా వెళ్తోంది. లోపల ఓ రోగి ఉండడంతో అతడిని హాస్పిటల్‌కు చేర్చేందుకు డ్రైవర్ వేగంగా వెళ్తున్నాడు. అయితే అదే రోడ్డు మీద వెళ్తున్న ఓ కార్ డ్రైవర్ మాత్రం ఆ అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా దాని ముందే చాలా స్పీడ్‌గా వెళ్తున్నాడు. అంబులెన్స్ సైరన్ వినబడినా అతడు మాత్రం తప్పుకోలేదు. చాలా దూరం అలాగే వెళ్లాడు. దీంతో ఆ కారును అంబులెన్స్ డ్రైవర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియో స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన పోలీసులు కార్ నెంబర్ ఆధారంగా యజమాని అడ్రస్ పట్టుకున్నారు. అతడి ఇంటికి వెళ్లి దిమ్మతిరిగే షాకిచ్చారు. అంబులెన్స్‌కు దారి ఇవ్వకుండా కారు నడిపినందుకు అతడికి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు ఆ డ్రైవర్ లైసెన్స్‌ను కూడా క్యాన్సిల్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 9 లక్షల మంది వీక్షించి తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

Viral video: ఏం క్రియేటివిటీ బాసూ.. ట్రైన్ కింద నుంచి కార్లు, పై నుంచి లారీలు ఎలా వెళ్తున్నాయో చూడండి..


Elon Musk: అమెరికా టు ఢిల్లీ.. కేవలం 30 నిమిషాలు.. ఎలన్ మస్క్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే..


Viral Video: ఇతడిని చూస్తే భయానికే భయం.. ఇతను ఏ పరిస్థితుల్లో భేల్ పూరీ చేస్తున్నాడో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే..


Viral Video: తప్పక చూడాల్సిన వీడియో.. మంచు మీద లావా ప్రవహిస్తుంటే ఎలా ఉందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2024 | 01:31 PM