ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. నడి సముద్రంలో తుఫానుకు భారీ ఓడల పరిస్థితి చూడండి..

ABN, Publish Date - Sep 23 , 2024 | 12:24 PM

ఈ భూమి మీద సముద్రాలు, మహా సముద్రాల గురించి మానవుడు ఎప్పట్నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. సముద్రాల మీద ప్రయాణాలు చేస్తూ వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా మానవ మేధస్సుకు చిక్కని ఎన్నో రహస్యాలు సముద్ర గర్భంలో ఎన్నో ఉన్నాయి.

Ships Caught Amid Violent Sea Storms

ఈ భూమి మీద సముద్రాలు, మహా సముద్రాల (Ocean) గురించి మానవుడు ఎప్పట్నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. సముద్రాల (Sea) మీద ప్రయాణాలు చేస్తూ వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయినా మానవ మేధస్సుకు చిక్కని ఎన్నో రహస్యాలు సముద్ర గర్భంలో ఎన్నో ఉన్నాయి. ఎంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారీ ఓడలు (Ships), జలాంతర్గాములు నిర్మించి ప్రయాణాలు సాగిస్తూనే సముద్రాలు సవాలు విసురుతూనే ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఒళ్లు గగుర్పాటునకు గురికావాల్సిందే. సముద్రంలోని తుఫాను (Storm) ధాటికి భారీ ఓడల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తే షాకవ్వాల్సిందే (Viral Video).


వైరల్ అవుతున్న ఆ వీడియోలో సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ప్రమాదకర తుఫానులు సంభవిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు కనబడుతోంది. భారీ అలల ధాటికి ఓడలు పైకి, కిందకు పడుతున్నాయి. సముద్రపు నీరు ఓడలోకి ప్రవేశిస్తోంది. అయినా ఆ ఓడలు మునిగిపోకుండా తుఫానులను తట్టుకుని నిలబడుతున్నాయి. అయితే అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం భయంతో నోటి మాట రాదు. ``ఈ ఓడలు, సిబ్బంది ఇలాంటి హింసాత్మక తుఫానులను ఎలా తట్టుకుని నిలబడతారో, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది`` అంటూ ఆ వీడియోకు కామెంట్‌ను జత చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 56 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాదాపు 47 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎలాంటి టెక్నాలజీ లేని వేల సంవత్సరాల క్రితం సముద్రాలపై ఎలా ప్రయాణం చేశారో``, ``సముద్రం చాలా భయంకరమైనది``, ``, “ప్రకృతి నిజంగా అపురూపమైనది``, ``ఆ అలలను జయించడం నిజంగా గొప్ప అనుభవం``, ``కెరటాల మధ్య దూరం కంటే పడవ పొడవుగా ఉండటం కీలకం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: మనవడి కోసం వినూత్న ట్రెడ్‌మిల్ తయారు చేసిన తాత.. ఆ కుర్రాడి బాధలు చూస్తే నవ్వు రాక తప్పదు..


Viral Video: ఓరి నాయనో.. రన్నింగ్ ట్రైన్‌లో కూడా పాము.. ఏసీ కోచ్‌లో ప్రత్యక్షమైన నాగరాజు.. ప్రయాణికుల కేకలు..


Optical Illusion: మీవి డేగ కళ్లని అనుకుంటున్నారా?.. అయితే 10 సెకెన్లలో ఈ ఫొటోల కొవ్వొత్తిని వెతకండి..


Viral Video: ఓరి.. దేవుడో.. ఓ శివ భక్తుణ్ని నంది ఎలా దీవించిందో చూడండి.. వీడియో చూస్తే నివ్వెరపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 23 , 2024 | 02:53 PM