ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: బలం ఉందని విర్రవీగితే ఇంతే.. చీమల దెబ్బకు కొండచిలువ పరిస్థితి ఏమైందో చూడండి.. వీడియో వైరల్..

ABN, Publish Date - Oct 02 , 2024 | 08:54 AM

బలం ఉందని విర్రవీగితే ఎంతటి వారికైనా పరాభవం తప్పదని ఈ పద్యం నీతి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అంత పెద్ద కొండచిలువను ఓ చీమల దండు మాయం చేసింది.

Snake invades ant territory and gets pulverized

బలవంతమైన సర్పము చలి చీమల (Ants) చేత చిక్కి చావదె సుమతి.. చిన్నప్పుడు చదువుకున్న ఈ సుమతి శతక పద్యం ఎప్పటికీ గుర్తుంచుకోదగినది. బలం ఉందని విర్రవీగితే ఎంతటి వారికైనా పరాభవం తప్పదని ఈ పద్యం నీతి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అంత పెద్ద కొండచిలువను (Python) ఓ చీమల దండు మాయం చేసింది. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కలిసికట్టుగా పోరాడితే ఎంత పెద్ద శత్రువును అయినా ఎదుర్కోవచ్చని చీమలు ఇస్తున్న సందేశం చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Viral Video).


@TheFigen అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. చీమలు ఉన్న ప్రాంతంలోకి ఓ కొండచిలువ ప్రవేశించింది. దీంతో ఆ కొండచిలువపై చీమలన్నీ కలిసి దాడికి దిగాయి. ఆ కొండచిలువను పై నుంచి కింద వరకు చీమలు చుట్టుముట్టాయి. ఈ చీమలను వదిలించుకోవడం కొండచిలువకు సాధ్యం కాలేదు. చివరకు ఆ చీమల దాడిలో ఆ కొండచిలువ హతమైంది. అత్యంత బలమైన కొండచిలువనే ఆ చీమలు చంపెయ్యడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ``ప్రకృతి మనకు చెప్పేది ఇదే.. ఏ జీవినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఒక జీవి కంటే ఓ సమూహం ఎప్పుడూ బలమైనది`` అని ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.8 కోట్ల మందికి పైగా వీక్షించారు. 82 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చీమలు ఎంత బలం ఉన్న వారినైనా ఇబ్బంది పెడతాయి``, ``ఐకమత్యమే మహబలమనే పాఠాన్నీ చీమల నుంచి నేర్చుకోవచ్చు``, ``చీమలు ఎంత పెద్ద పనిని అయినా కఠోర దీక్షతో పూర్తి చేస్తాయి``, ``చీమలు గొప్ప గురువులు.. ఎన్నో విషయాలు నేర్పిస్తాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 10 సెకెన్లలో పట్టుకోండి..


Viral Video: వేగంగా వెళ్తున్న బైక్‌పై విన్యాసాలు.. చివరకు ఆ యువకుడి పరిస్థితి ఏమైందంటే..


Viral Video: ఇంక వీళ్లు మారరా..? మెట్రో రైలులో యువతి డ్యాన్స్ వీడియో వైరల్.. నెటిజన్ల రియాక్షన్స్ ఏంటంటే..


Viral: 17 ఏళ్ల క్రితం బార్‌ బిల్లు వైరల్.. 2007లో ఢిల్లీ బార్‌లో పార్టీ చేసుకుంటే ఎంత ఖర్చైందంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 08:54 AM