ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

SpaceX: ఎలన్ మస్క్ ``స్పేస్ ఎక్స్`` అద్భుతం.. లాంచ్‌ప్యాడ్‌‌పై బూస్టర్ సేఫ్ ల్యాండింగ్.. వీడియో చూడండి..

ABN, Publish Date - Oct 14 , 2024 | 12:48 PM

ప్రపంచంలోనే అతిపెద్దదైన ``స్టార్‌షిప్‌`` మెగా రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన కొద్ది సేపటి తర్వాత దాని బూస్టర్‌ తిరిగివచ్చి విజయవంతంగా లాంచ్‌ప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

SpaceX successfully "caught" the first-stage booster of its Starship

అంతర్జాతీయ కుభేరుడు ఎలన్ మస్క్‌ (Elon Musk)కు చెందిన అంతరిక్ష సంస్థ ``స్పేస్ ఎక్స్`` (SpaceX) అద్భుతం సృష్టించింది. నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌ బూస్టర్‌ను (Rocket Booster) తిరిగి లాంచ్‌ప్యాడ్‌ దగ్గరకే సురక్షితంగా రప్పించి చరిత్ర సృష్టించింది. ఒక రాకెట్‌కు చెందిన బూస్టర్‌ను తిరిగి లాంచ్‌ ప్యాడ్‌ (Launchpad) వద్దకు తీసుకురావడం ఇదే మొట్టమొదటిసారి. ప్రపంచంలోనే అతిపెద్దదైన ``స్టార్‌షిప్‌`` మెగా రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించిన కొద్ది సేపటి తర్వాత దాని బూస్టర్‌ తిరిగి వచ్చి విజయవంతంగా లాంచ్‌ప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


ఆదివారం టెక్సస్‌ తీరంలో ఈ ప్రయోగం నిర్వహించారు. అంతరిక్షంలోకి ప్రయోగించిన స్టార్‌షిప్‌ రాకెట్‌ పొడవు 121 మీటర్లు. ఇందులో బూస్టర్‌, స్పేస్‌క్రాఫ్ట్‌ అని రెండు విభాగాలుంటాయి. బూస్టర్‌ పొడవు 71మీటర్లు. ప్రయోగంలో భాగంగా రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపించారు. కొద్దిసేపటి తర్వాత, బూస్టర్‌ నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ విడిపోయింది. స్పేస్‌క్రాఫ్ట్‌ను హిందూ మహాసముద్రంలో దింపేశారు. బూస్టర్‌ను మాత్రం లాంచ్‌ప్యాడ్ దగ్గరకు తిరిగి రప్పించారు. లాంచ్ ప్యాడ్ దగ్గర ఏర్పాటు చేసిన చాప్‌స్టిక్స్ బూస్టర్‌ను విజయవంతంగా ఒడిసిపట్టుకున్నాయి. చాలా మంది ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.


ఈ అద్బుతాన్ని లైవ్ స్ట్రీమ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. స్పేస్‌ ఎక్స్‌కే చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ బూస్టర్లను తిరిగి ఉపయోగించుకునేందుకు వీలుగా రూపొందించారు. అయితే, ఇప్పటివరకు ఆ బూస్టర్ల సముద్రాల్లో పడేలా చేసి ఆ తర్వాత ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం మొదటి సారి ఓ రాకెట్ బూస్టర్‌ను లాంచింగ్ ప్యాడ్ దగ్గరకే తిరిగి రప్పించారు. ``ఇది ఇంజనీరింగ్‌ అద్భుతం`` అని స్పేస్ ఎక్స్ ప్రతినిధి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్.. స్పాట్‌లోనే ముగ్గురి మృతికి కారణమైన భయంకర ప్రమాదాన్ని చూడండి..


Viral Video: ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ట్రాక్టర్ టైర్లను బైక్‌తో ఎలా తీసుకెళ్తున్నాడో చూడండి..


Viral Video: ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలు.. కాళ్లు లేకపోయినా ధైర్యంగా ముందుకెళ్లొచ్చు.. వీడియో వైరల్..

Picture Puzzle: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 23 సెకెన్లలో కనుక్కోండి...


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 14 , 2024 | 12:48 PM