Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బస్సులోని ప్రయాణికులకు షాక్ ఇచ్చిన చిరుత.. వీడియో వైరల్..
ABN, Publish Date - Oct 07 , 2024 | 07:06 PM
ఇంతకుముందు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వంటి ప్రమాదకర జంతువులను చూసేందుకు చాలా మంది జూలకు వెళ్లేవారు. అయితే ఇటీవలి కాలంలో నేరుగా అటవీ పర్యటనలకే వెళ్తున్నారు. దక్షిణాఫ్రికా తరహాలో మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో జంగిల్ సఫారీ టూర్లు ఎక్కువయ్యాయి.
వన్య మృగాలకు (Wild Animals) ఎంత దూరంగా ఉంటే మీరు అంత క్షేమంగా ఉంటారు. పులులు, సింహాలు వంటి క్రూర మృగాలు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ అర్థం కాదు. వాటికి కోపం వచ్చిందంటే ఎదుటి వారు ప్రాణాల మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఇంతకుముందు పులులు, సింహాలు, ఎలుగుబంట్లు వంటి ప్రమాదకర జంతువులను చూసేందుకు చాలా మంది జూ (Zoo)లకు వెళ్లేవారు. అయితే ఇటీవలి కాలంలో నేరుగా అటవీ పర్యటనలకే వెళ్తున్నారు. దక్షిణాఫ్రికా తరహాలో మన దేశంలో కూడా ఇటీవలి కాలంలో జంగిల్ సఫారీ టూర్లు (Safari Tour) ఎక్కువయ్యాయి. అలా టూర్‌కు వెళ్లిన ప్రయాణికులకు ఓ చిరుతపులి (Leopard) అద్భుతమైన అనుభవం అందించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
@karnatakaportf అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. కర్ణాటకలోని బన్నెరఘట్ట నేషనల్ పార్క్ (Bannerghatta National Park)లో ఈ వీడియోను చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బన్నెరఘట్ట నేషనల్ పార్క్‌కు కొందరు ప్రయాణికులు టూర్‌కు వెళ్లారు. ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు దగ్గరకు ఓ చిరుత పులి వచ్చింది. పైకి ఎగిరి ఆ బస్సు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. దీంతో బస్సులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో అరుపులు, కేకలు వేశారు. అయితే ఆ బస్సు కిటికీలకు మెస్ ఉండడంతో చిరుత లోపలికి ప్రవేశించలేకపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 10 వేల మందికి పైగా వీక్షించారు. చాలా మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``భయంకర షాకింగ్ అనుభవం``, ``ఆ అనుభవాన్ని టూరిస్ట్‌లు ఎప్పటికీ మర్చిపోలేరు``, ``ఆ చిరుత బస్సు లోపలికి వెళ్లి ఉంటే మరింత ఫన్‌గా ఉండేది``, ``చిరుతపులిని అంత దగ్గరగా చూడటం, దాని కళ్లలోకి చూడటం థ్రిల్లింగ్ అనుభవం``, ``చిరుత భలే షాక్ ఇచ్చింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వావ్.. మ్యాగీని ఇలా కూడా తయారు చేయవచ్చా? రోటీ మ్యాగీతో ఆరోగ్యం అంటున్న నెటిజన్లు..
Optical Illusion: ఈ గుహలో ఓ కుక్క దాక్కుంది.. 5 సెకెన్లలో కనిపెడితే మీ కళ్లు చాలా పవర్‌ఫుల్..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Oct 07 , 2024 | 07:06 PM