ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కార్ గ్యారేజ్ ఓపెన్ చేసిన వ్యక్తికి షాక్.. లోపల భారీ ఆకారాన్ని చూసి పరుగులు.. వీడియో వైరల్..

ABN, Publish Date - Sep 25 , 2024 | 10:56 AM

మీరు కారు తీయడానికి హడావిడిగా గ్యారేజ్‌కు వెళ్లినపుడు అక్కడ అనుకోని అతిథి ఎదురైతే ఎలా ఉంటుంది. కలలో కూడా ఊహించని భారీ ఆకారం గ్యారేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది.

car garage

మీరు కారు (Car) తీయడానికి హడావిడిగా గ్యారేజ్‌కు (Car Garage) వెళ్లినపుడు అక్కడ అనుకోని అతిథి ఎదురైతే ఎలా ఉంటుంది. కలలో కూడా ఊహించని భారీ ఆకారం గ్యారేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు మీరు ఎలా స్పందిస్తారు. తాజాగా ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆ వ్యక్తికి షాక్ నుంచి తేరుకోవడానికి కొన్ని సెకెన్లు పట్టింది. ఆ ఘటన మొత్తం ఆ గ్యారేజ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @Wild_XW అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).


ఈ సంఘటన అమెరికా (America)లో జరిగింది. ఓ చిన్న టౌన్‌కు చెందిన వ్యక్తి తన కారుని తీసుకోవడానికి గ్యారేజీకి వెళ్లాడు. డోర్ ఓపెన్ చేసిన వెంటనే, అక్కడ భారీ ఎలుగుబంటి (Bear) తిరగడం చూశాడు. గ్యారేజ్ తలుపు తెరిచిన వెంటనే, ఎలుగుబంటి తన కారు దగ్గర ప్రశాంతంగా కూర్చోవడం చూశాడు. ఒక్కక్షణం భయపడి పరుగులు పెట్టాడు. ఎలుగుబంటి కూడా పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది. దీంతో ఆ వ్యక్తి అలాగే నిలబడి దానిని తరమడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత కారు ఎక్కి డోర్ వేసుకుని హార్న్ మోగించాడు. మొత్తానికి ఆ హఠాత్పరిణామం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు.


ఈ ఘటన మొత్తం ఆ గ్యారేజ్‌లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.2 కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 1.6 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అటువంటి పరిస్థితిలో నేను ఉసేన్ బోల్ట్ కంటే వేగంగా పరిగెడతాను``, ``ఆ వ్యక్తి ధైర్యంగా ప్రవర్తించాడు``, ``ఎలుగుబంటిని అంత దగ్గరగా చూడడం షాకింగ్ అనుభవం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీ మెదడుకు చిక్కుముడి.. వీటిల్లో ఏ పైప్ ద్వారా బకెట్ నిండుతోందో కనిపెట్టండి..


Viral Video: ఈ ఆటోవాలా తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఆటోలో ఎలాంటి కుర్చీ పెట్టుకున్నాడో చూడండి..


Viral Video: ఐఫోన్ మేనియా ఆ రేంజ్‌లో ఉంది మరి.. ఈ ఐఫోన్ వాటర్ ప్రూఫ్ మాత్రమే కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కూడా..


Optical Illusion: మీ కళ్ల సామర్థ్యానికి పరీక్ష.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 15 సెకెన్లలో పట్టుకోండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 25 , 2024 | 10:56 AM