Viral Video: వామ్మో.. కిందకు దిగడానికి ఇంత రిస్క్ అవసరమా? ఏమైనా తేడా వస్తే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో..
ABN, Publish Date - Nov 04 , 2024 | 02:53 PM
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి సాహసం చూస్తే ఆందోళన చెందడం ఖాయం. ఆమె పై అంతస్థు నుంచి కిందకు రావడానికి ప్రమాదకర దారిని ఎంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యకరంగా, మరికొన్ని ఫన్నీగా ఉండి మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి వీడియోలు జనాలకు బాగా నచ్చడంతో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువతి సాహసం (Dangerous Stunt) చూస్తే ఆందోళన చెందడం ఖాయం. ఆమె పై అంతస్థు నుంచి కిందకు రావడానికి ప్రమాదకర దారిని ఎంచుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. ఆ వీడియోను ఓ భారీ భవన నిర్మాణ స్థలంలో చిత్రీకరించారు. ఆ భవన నిర్మాణం దగ్గర పని చేస్తున్న ఓ యువతి పై అంతస్థు నుంచి కిందకు రావడానికి ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంది. పై అంతస్థకు కాంక్రీట్ మిక్చర్‌ను తీసుకెళ్లే లిఫ్ట్‌కు ప్రమాదకరంగా వేలాడుతూ ఆ యువతి కిందకు వచ్చింది. అంత ఎత్తు నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఆ యువతి తన ప్రాణాలను లెక్క చేయకుండా కిందకు వచ్చింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 4 లక్షల మంది వీక్షించారు. దాదాపు 24 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``భారతీయ మహిళలకు ధైర్యం ఎక్కువ``, ``ఇది జోక్ కాదు.. చిన్న తేడా వచ్చినా భారీ ప్రమాదం జరిగి ఉండేది``, ``ఇక్కడ పేద వాళ్ల ప్రాణాలకు లెక్క లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral: వార్నీ.. ఐరన్ బాక్స్‌ను ఇలా కూడా ఉపయోగించవచ్చా? ఆ వ్యక్తి తెలివికి ఫిదా కావాల్సిందే..
Viral Video: ఇన్ని తెలివితేటలు తట్టుకోలేం భయ్యా.. పాత చెప్పును ఫోన్ హోల్డర్‌లా ఎలా మార్చాడో చూడండి..
Viral Video: వార్నీ.. ఇదెక్కడి పిచ్చి.. కరెన్సీ నోట్లను కాల్చడం ఏంటి.. ఎలాంటి శిక్ష పడుతుందంటే..
Viral Video: అందరికీ ఇలాంటి టీచర్ ఉండాలి.. క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఎలా పాఠం చెబుతున్నారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Nov 04 , 2024 | 02:53 PM