Viral: తలలో బుల్లెట్ ఉందని తెలీక పార్టీలో ఎంజాయ్ చేశాడు.. నాలుగు రోజుల తర్వాత డ్రైవింగ్ చేస్తుండగా..
ABN, Publish Date - Jan 26 , 2024 | 06:41 PM
కంట్లో చిన్న నలుసు పడితేనే తలకిందులవుతుంటాం. ఇక తలకు చిన్న దెబ్బ తగిలితే ఆ నొప్పి భరించలేం. అదే ఇక తలలో బుల్లెట్ దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడికక్కడే..
కంట్లో చిన్న నలుసు పడితేనే తలకిందులవుతుంటాం. ఇక తలకు చిన్న దెబ్బ తగిలితే ఆ నొప్పి భరించలేం. అదే ఇక తలలో బుల్లెట్ దిగితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అక్కడికక్కడే ప్రాణాలు పోవడం మాత్రం పక్కా.. ఎంతో అదృష్టం ఉంటే తప్ప బతికే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి.. తలలో బుల్లెట్ దిగినా నాలుగు రోజులు ఎంజాయ్ చేశాడు. ఇలా నాలుగు రోజులు గడిపేశాడు. చివరకు ఓ రోజు కారు నడుపుతుండగా ఏం జరిగిందంటే..
బ్రెజిల్‌కు (Brazil) చెందిన మాటియస్ ఫాసియో 21 ఏళ్ల యువకుడికి వింత అనుభవం ఎదురైంది. స్నేహితులతో కలిసి నూతన సంవత్సరం రోజున వేడుకలు (New Year celebrations) చేసుకుంటుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీచ్‌లో సరదాగా గడుపుతుండగా.. ఉన్నట్టుండి తలపై ఏదో పడినట్లు అనిపించింది. రక్తం రావడంతో (Head injury) స్నేహితులంతా చుట్టూ చేరారు. ఎవరో రాయి విసిరి ఉంటారని అంతా అనుకున్నారు. అతని స్నేహితుల్లో ఓ వ్యక్తి ప్రాథమిక చికిత్స చేసి కట్టు కట్టాడు. తర్వాత నాలుగు రోజుల పాటు స్నేహితులతో పార్టీ పార్టీ చేసుకున్నాడు.
తలలో బుల్లెట్ ఉన్నా అతడికి నాలుగు రోజుల పాటూ ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అయితే ఆ తర్వాత ఓ రోజు కారులో వెళ్తుండగా.. సడన్‌గా అతడి చేయి స్పర్శ కోల్పోతున్నట్లు అనిపించింది. దీంతో షాకైన అతను వెంటనే వైద్యుడిని సంప్రదించాడు. వారు తలకు స్కానింగ్ చేయగా.. లోపల బుల్లెట్ (Bullet in the head) కినిపించింది. దాన్ని చూసి వైద్యులు కూడా షాకయ్యారు. తర్వాత రెండు గంటల పాటు ఆపరేషన్ చేసి అతి కష్టం మీద 9mm బుల్లెట్‌ను తొలగించారు. ఇలాంటి కేసు తమ సర్వీసులో ఎప్పుడూ చూడలేదని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని విచారించారు. బుల్లెట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - Jan 26 , 2024 | 06:49 PM