Leap Year: లీపు ఇయర్ వస్తే కొందరు ఎగిరి గంతేస్తారు..?
ABN, Publish Date - Feb 29 , 2024 | 05:37 PM
లీపు సంవత్సరం వస్తే కొందరి ఆనందానికి హద్దు ఉండదు. బర్త్ డే కోసం ఆశగా ఎదురు చూస్తారు. నాలుగో ఏడాది బర్త్ డే రావడంతో తెగ సంతోష పడతారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: లీపు సంవత్సరం ( Leap Year ) వస్తే కొందరి ఆనందానికి హద్దు ఉండదు. బర్త్ డే (Birthday) కోసం ఆశగా ఎదురు చూస్తారు. నాలుగో ఏడాది బర్త్ డే రావడంతో తెగ సంతోష పడతారు. అసలు లీపు ఇయర్ అంటే ఏంటీ..? నాలుగేళ్లకు ఒకసారి ఎందుకు వస్తోంది.
గ్రాండ్‌గా సెలబ్రేషన్స్
సాధారణంగా ఏడాదికి 365 రోజుల 6 గంటలుగా లెక్కిస్తుంటారు. ఆరు గంటల సమయాన్ని నాలుగేళ్లకోసారి కలుపుతుంటారు. రోజు 24 గంటలు కాగా.. 6 గంటలు నాలుగు కలుపగా ఒకరోజు అవుతుంది. నాలుగో ఏడాది లీపు సంవత్సరం అవుతుంది. ఫిబ్రవరిలో 28 రోజులు ఉండగా నాలుగో ఏడాది 29వ తేదీ వచ్చి చేరుతుంది. కొందరు ఆ రోజున జన్మిస్తారు. మరికొందరు పెళ్లి చేసుకుంటారు. నాలుగేళ్లకోసారి బర్త్ డే, మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరుపుకుంటారు.
అర్థరాత్రి దాటిన తర్వాత
లీపు సంవత్సరంలో జన్మించిన వారు ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత బర్త్ డే, మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. క్యాలెండర్‌లో ప్రత్యేక రోజు ఉండకపోవడంతో కొందరు జరుపుకునేందుకు ఇష్టపడరు. యుకేలో మాత్రం లీపు ఇయర్ రోజు జన్మించినప్పటికీ ఫిబ్రవరి 28వ తేదీన బర్త్ డే డేట్ ఇస్తారు. ఇప్పటికీ 5 మిలియన్ల మంది ఉన్నారని తెలుస్తోంది. స్పానిస్ ప్రీమియర్ పెడ్రో శాంచెజ్, అమెరికా ర్యాప్ స్టార్ జా రూల్, సీరియల్ కిల్లర్ ఐలీన్ ఉర్నోస్ వంటి వారు లీపు సంవత్సరంలో జన్మించిన వారే.
శ్రీ విష్ణు
టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు కూడా లీపు ఇయర్‌లో జన్మించారు. 2009లో బాణం మూవీతో తెరంగ్రేటం చేశారు. సోలో, లవ్ ఫెయిల్యూర్, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర, అర్జున ఫల్గుణ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇలా చాలా మంది లీపు ఇయర్ రోజున బర్త్ డే జరుపుకుంటారు. మరికొందరు మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటారు.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 29 , 2024 | 05:37 PM