ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Harsh Goenka: దోశెలు వేసినా సరే మీ స్టైల్ చూపించండి.. హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఆసక్తికర వీడియో!

ABN, Publish Date - Jul 07 , 2024 | 10:04 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. సామాన్యుల ప్రతిభ కూడా అందరినీ చేరుతోంది. సాధారణ వ్యక్తులు తమ రోజువారీ జీవితంలో చూపించే అసాధారణ ప్రతిభ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది.

Harsh Goenka

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. సామాన్యుల ప్రతిభ (Talent) కూడా అందరినీ చేరుతోంది. సాధారణ వ్యక్తులు తమ రోజువారీ జీవితంలో చూపించే అసాధారణ ప్రతిభ సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటోంది. అలాంటి వీడియోలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ఆనంద్ మహీంద్రా, హర్ష్ గోయెంకా (Harsh Goenka) తమ అనుచరులతో పంచుకుంటుంటారు. వాటిపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. తాజాగా హర్ష్ గోయెంకా షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది (Viral Video).


హర్ష్ గోయెంకా తాజాగా ముంబై ఫ్లయింగ్ దోశెవాలాకు (Flying dosawala) సంబంధించిన వీడియోను పంచుకున్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి ముంబై (Mumbai)లోని రోడ్డు పక్కన టిఫిన్ స్టాల్ పెట్టుకున్నాడు. పెద్ద పెనంపై వరుసగా దోశెలు వేస్తున్నాడు. వాటిని తనదైన స్టైల్లో తీసి నేరుగా ప్లేట్‌ల్లోకి విసిరేస్తున్నాడు. అక్కడ ఉన్న మరో వ్యక్తి చక్కగా వాటిని క్యాచ్ పట్టుకుని ప్లేట్‌లలో పెట్టి కస్టమర్లకు అందిస్తున్నాడు. వారి ట్యాలెంట్‌కు ముగ్ధులైన కస్టమర్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఈ వైరల్ వీడియో తాజాగా హర్ష్ గోయెంకా దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ఆ వీడియోను షేర్ చేసి.. ``మీరు ఏం చేసినా మీ స్టైల్లో చేయండి`` అని కామెంట్ చేశాడు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది అంత సులభం కాదు``, ``దోశెలు వేసే వ్యక్తి కంటే వాటిని క్యాచ్ పట్టుకుంటున్న వ్యక్తికే ట్యాలెంట్ ఎక్కువ``, ``ఫుడ్ విత్ ఎంటర్‌టైన్మెంట్``, ``చాలా మందికి రజినీకాంత్ ఆటిట్యూడ్ ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: మీవి నిజంగా డేగ కళ్లు అయితే ఈ ఫొటోలో ఉన్న తప్పును 10 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: ఇది బైక్ లాంటిది.. కానీ బైక్ కాదు.. ఈ కుర్రాడి తెలివితేటలకు భారతరత్న ఇవ్వాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 07 , 2024 | 10:04 AM

Advertising
Advertising
<