ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: మెడలో దండ వేయగానే వధువు ప్రవర్తనకు షాక్.. నివ్వెరపోయిన వరుడు.. అసలేం జరిగిందంటే..

ABN, Publish Date - May 27 , 2024 | 03:59 PM

పెళ్లి వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వివాహాలలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, కొన్ని ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

bride and groom

పెళ్లి (Marriages) వేడుకలకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. వివాహాలలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, కొన్ని ఫన్నీ ఘటనలకు సంబంధించిన వీడియోలు (Wedding Videos) చాలా మందిని ఆకట్టుకుంటుంటాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫన్నీ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియోలోని వధువు (Bride) ప్రవర్తన చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. anita_suresh అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది.


వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వివాహ వేదికపై వధూవరులు ఉన్నారు. వరుడి (Groom) మెడలో దండ వేసిన వధువు వెంటనే చప్పట్లు కొడుతూ వింతగా డ్యాన్స్ చేసింది. దీంతో వరుడు షాకయ్యాడు. ఆ తర్వాత వధువు మెడలో వరుడు దండ వేశాడు. ఆ తర్వాత వధువు మరింత రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. దీంతో వరుడు, అతడి స్నేహితుడు నివ్వెరపోయారు. పక్కనే ఉన్న బంధువులు ఆ వధువును పట్టుకుని కాస్త కంట్రోల్ చేశారు. పెళ్లవుతోందనే ఆనందంలో ఆ వధువు చేసిన డ్యాన్స్ చాలా మందికి నవ్వులు తెప్పిస్తోంది.


సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫన్నీ వీడియోను 23 లక్షల మంది వీక్షించారు. 25 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మీకు ఇష్టమైన వరుడు దొరికితే ఇలాగే జరుగుతుంది``, ``ఇది ఆమె చిన్ననాటి ప్రేమగా కనిపిస్తోంది``, ``పాపం.. ఆ వరుడు షాక్‌తో కొయ్యబారిపోయాడు``, ``ఆ వరుడికి ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: దయచేసి పిల్లల్ని ఒంటరిగా లిఫ్ట్ ఎక్కనివ్వకండి.. ఈ వీడియోలో పిల్లాడికి ఏం జరిగిందో చూస్తే షాకవ్వాల్సిందే!


Viral Video: ఇంకా ఇలాంటి గ్రామాలున్నాయా? ఆ ఊళ్లో పానీపూరీలను ఎలా కొంటున్నారో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 27 , 2024 | 03:59 PM

Advertising
Advertising