Viral Video: బ్యాటింగ్ చేస్తుండగా హఠాత్తుగా పిచ్ పైకి నీళ్లు.. అసలేం జరిగిందో చూసి నెటిజన్లు షాక్..
ABN, Publish Date - Dec 03 , 2024 | 02:03 PM
ఎన్నో వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని మనల్ని ఆకట్టుకుంటున్నాయి. మరికొన్ని మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. అలాంటి ఎన్నో వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. @MeenaRamesh91 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ (Batting) చేస్తున్నాడు. హెల్మెట్, బ్యాట్లు, గ్లౌస్ పెట్టుకుని హార్డ్ బాల్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో బౌలర్ వేసిన బంతిని వెనుకకు ఆడాడు. అయితే ఆ వ్యక్తి బ్యాటింగ్ చేస్తున్న నెట్స్ (Nets) వెనుక ఓ వాటర్ ట్యాంక్ (Water Tank) ఉంది. హార్డ్ బాల్ నేరుగా వెళ్లి ఆ ట్యాంక్‌కు తగలగానే అది పగిలిపోయింది. దీంతో నీరు వరదలా ఆ పిచ్‌ను ముంచెత్తాయి. దీంతో ఆ బ్యాటర్ ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. పిచ్ మొత్తం నీటితో తడిసిపోయి పాడైపోయింది. ఆ ఘటన అంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు మూడు లక్షల మందికి పైగా వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``అద్భుతమైన షాట్ కొట్టాడు``, ``వాటర్ ట్యాంక్ అంత బలహీనంగా ఉందా?``, ``భయ్యా.. అంత గట్టిగా షాట్ కొడితే ఎలా``, ``వెరీ ఫన్నీ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: యమధర్మరాజు లీవ్‌లో ఉన్నాడా.. ఈ కుర్రాడి ప్రమాదకర స్టంట్‌పై నెటిజన్ల రియాక్షన్స్ వింటే..
Viral News: అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్, గర్ల్‌ఫ్రెండ్స్.. వియత్నాంలో ఈ కొత్త ట్రెండ్‌కు కారణం ఏంటంటే..
Viral Video: ఈ కుక్కకు ఏమైంది.. పెళ్లి మండపంలో వధువుకు చుక్కలు చూపించిన పెట్ డాగ్..
Viral News: వావ్.. వంట మనిషి కోసం రెజ్యూమ్.. వెల్లువలా వస్తున్న జాబ్ ఆఫర్లు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి
Updated Date - Dec 03 , 2024 | 02:03 PM