ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

White Hair: తెల్ల జుట్టుకు పదే పదే రంగు వెయ్యక్కర్లేదు.. ఒక్క సారి ఈ హెయిర్ ప్యాక్ వేశారంటే చాలు..!

ABN, Publish Date - Jun 12 , 2024 | 04:27 PM

తెల్లజుట్టు ఇప్పట్లో చాలామందికి సాధారణ విషయం అయిపోయింది. నిండా ముప్పై ఏళ్లు నిండకనే తలంతా తెల్ల వెంట్రుకలతో కనిపించేవారు బోలెడు ఉంటారు. కొందరికి విసుగొచ్చి ఈ తెల్ల వెంట్రుకల గురించి పట్టించుకోవడం మానేస్తారు. కానీ మరికొందరు మాత్రం అందంగా కనిపించాలనే ఆత్రంతో తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెయిర్ డై లు వాడతారు. కానీ..

తెల్లజుట్టు ఇప్పట్లో చాలామందికి సాధారణ విషయం అయిపోయింది. నిండా ముప్పై ఏళ్లు నిండకనే తలంతా తెల్ల వెంట్రుకలతో కనిపించేవారు బోలెడు ఉంటారు. కొందరికి విసుగొచ్చి ఈ తెల్ల వెంట్రుకల గురించి పట్టించుకోవడం మానేస్తారు. కానీ మరికొందరు మాత్రం అందంగా కనిపించాలనే ఆత్రంతో తెల్ల జుట్టును కవర్ చేయడానికి హెయిర్ డై లు వాడతారు. అయితే మార్కెట్ లో దొరికే హెయిర్ డైలలో రసాయనాలు ఉంటాయి. అవి మెదడుకు సంబంధించిన సమస్యలు కలిగిస్తాయి. అందుకే ఇంట్లోనే తయారు చేసే ఈ హెయిర్ ప్యాక్ వేసుకుంటే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. పదే పదే హెయిర్ కలర్ వెయ్యాల్సిన అవసరం కూడా ఉండదు. అదేంటో.. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..

తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడే చాలా మంది శరీరంలో విటమిన్ డి, విటమిన్ బి12 లోపం ఉంటుంది. ఒత్తిడి, పోషకాహార లోపం కారణంగా కూడా జుట్టు తెల్లగా మారుతుంది. తెల్లజుట్టును నివారించడానికి ఆహారంలో అవసరమైన పోషకాలను చేర్చడం చాలా ముఖ్యం. దాంతో పాటూ ఈ కింది హెయిర్ ప్యాక్ ఉపయోగించాలి.

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!


కావలసిన పదార్థాలు..

కాఫీ పొడి.. 2 ప్యాకెట్లు. (చిన్నవి)

హెన్నా పొడి.. 2 స్పూన్లు

గ్రీన్ టీ పొడి.. 1స్పూన్

పెరుగు.. 2 స్పూన్లు

నీరు .. అవసరాన్ని బట్టి

ఎలా తయారుచేయాలంటే..

ఒక పాన్ తీసుకుని గ్యాస్ స్టౌ వెలిగించి తక్కువ మంట మీద ఉంచాలి.

పాన్లో కాఫీ పొడి, హెన్నా పొడి, గ్రీన్ టీ పొడిని జోడించాలి.

అందులో అరగ్లాసు నీళ్లు పోసి మూడు పదార్థాలను బాగా మిక్స్ చేయాలి.

గ్యాస్ మంటను తక్కువగా ఉంచి నీరంతా ఆరిపోయే వరకు ఉడికించాలి.

దీని తరువాత 2 చెంచాల పెరుగు వేసి పేస్ట్‌ను మరింత ఉడికించాలి.

హెన్నా రంగు నల్లగా మారి, పేస్ట్ లాగా ఉందని అనిపించిన తరువాత గ్యాస్ స్టౌ ఆఫ్ చేయాలి.


ఎలా వాడాలి?

హెయిర్ డై లేదా ఇతర హెన్నా మాదిరిగానే దీన్ని కూడా జుట్టుకు అప్లై చేయాలి. దీన్ని జుట్టుకు అప్లై చేసిన తరువాత కనీసం అరగంట సేపు అలాగే ఉంచాలి.

హెయిర్ ప్యాక్ ఆరిన తరువాత షాంపూ లేకుండా జుట్టును సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ హెయిర్ ప్యాక్ జుట్టును దీర్ఘకాలం పాటూ నల్లగా ఉంచుతుంది. ఇందులో రసాయనాలు ఏమీ ఉండవు కాబట్టి జుట్టుకు ఎలాంటి నష్టం కలగదు.

ఈ సూపర్ ఫుడ్స్ తింటే చాలు.. తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం..!

తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 12 , 2024 | 04:27 PM

Advertising
Advertising