Viral Video: ఊపిరి బిగబట్టి చూడాల్సిన వీడియో.. కూతురి కోసం ట్రైన్ కిందకు తల్లి.. ప్రాణాలతో ఎలా బయటపడ్డారంటే..
ABN, Publish Date - Sep 09 , 2024 | 08:18 AM
ఒక బిడ్డ కోసం తల్లి ఎంతటి ప్రమాదానికైనా ఎదురెళ్తుంది. బిడ్డను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన జీవితం గురించి పట్టించుకోదు. ప్రస్తుతం అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒక బిడ్డ కోసం తల్లి (Mother) ఎంతటి ప్రమాదానికైనా ఎదురెళ్తుంది. బిడ్డను కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడుతుంది. తన జీవితం గురించి పట్టించుకోదు. ప్రస్తుతం అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక తల్లి తన బిడ్డ (Daughter) ప్రాణాలను రక్షించడానికి రైలు (Train) పట్టాల పైకి వెళ్లింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలను, తన బిడ్డ ప్రాణాలను కాపాడుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. shera_qureshhii747 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రైలు అతి వేగంగా వెళ్తోంది. జాగ్రత్తగా గమనిస్తే ఆ రైలు కింద ఓ మహిళ పడుక్కున్నట్టు కనిపిస్తోంది. వీడియో చూస్తుంటే మహిళ ఆత్మహత్యకు ప్రయత్నిస్తోందా అనిపిస్తుంది. రైలు పూర్తిగా వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ లేచి కూర్చుంది. ఆమె ఒడిలో ఓ పసిబిడ్డ ఉంది. రైలు వెళ్లిపోయిన తర్వాత అందరూ ఆమెను పైకి లేపి సహాయం చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో బిడ్డ, తల్లి ఇద్దరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారు. ఈ పాత వీడియో ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వైరల్ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 4.9 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``తల్లి గొప్ప యోధురాలు``, ``తల్లి తన బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది``, ```ఈ అనుభూతిని వ్యక్తపరిచే పదాలు లేవు``, ``తల్లిని మించిన ప్రపంచం లేదు`` అంటూ నెటిజన్లు ఎమోషనల్ కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలోని ``Rug`` ఎక్కడుందో కనిపెట్టండి.. మీ కళ్ల సామర్థ్యాన్ని పరీక్షించుకోండి..
Viral Video: కాళ్లు లేకపోతేనేం.. ఈమె ధైర్యం, పట్టుదల ముందు ఎవరు సరిపోతారు.. ఆమె డ్యాన్స్ చూడండి..
Viral Video: ఆహా.. ఈ కుర్రాడి ట్యాలెంట్‌కు అవాక్కవ్వాల్సిందే.. అమ్మాయిలా ఎలా డ్యాన్స్ చేశాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Sep 09 , 2024 | 08:18 AM